ఏబీ డివిలియర్స్ కీలక నిర్ణయం, క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు

AB de Villiers, ab de villiers age, AB de Villiers Announces His Retirement, AB de Villiers Announces Retirement, AB de Villiers announces retirement from all forms, AB de Villiers Announces Retirement from All Forms of Cricket, ab de villiers retirement, ab de villiers retirement age, abd retirement from ipl, Former South Africa captain, IPL, IPL 2021, is ab de villiers retired from international cricket, is ab de villiers retired from ipl 2021, Mango News

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్స్ కు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లుగా శుక్రవారం నాడు ప్రకటించాడు. ఏబీ డివిలియర్స్ గతంలోనే దక్షిణాఫ్రికా జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించగా, ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (ఆర్సీబీ) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా ఆర్సీబీకి కూడా వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కు మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ ను ఆర్సీబీ యాజమాన్యం మళ్ళి రెటైన్ చేసుకుంటుందని క్రీడాభిమానులు భావిస్తున్న సమయంలో, పూర్తిగా క్రికెట్ కే గుడ్ బై చెబుతున్నట్టు ట్విట్టర్ వేదికగా ఏబీ డివిలియర్స్ ప్రకటన చేశాడు. మొత్తం 17 ఏళ్ల తన క్రికెట్ కెరీర్‌ లో దక్షిణాఫ్రికా తరపున 114 టెస్టులు, 228 వన్డేలు మరియు 78 టీ20లు ఆడాడు. అలాగే మొత్తం 10 సీజన్లలో ఆర్సీబీ తరపున ఏబీ డివిలియర్స్ 156 మ్యాచ్‌లు ఆడి 4,491 పరుగులు చేశాడు.

రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ, “నేను జీవితాంతం ఆర్సీబీయన్‌గా ఉండబోతున్నాను. ఆర్సీబీ జట్టులో ప్రతి ఒక్కరు నాకు కుటుంబసభ్యులుగా మారారు. ఆటగాళ్లు వస్తారు, వెళతారు, కానీ ఆర్సీబీలో మనం ఒకరికొకరు కలిగి ఉన్న స్ఫూర్తి మరియు ప్రేమ ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి. నేను ఇప్పుడు సగం భారతీయుడిని అయ్యాను మరియు దాని గురించి నేను గర్వపడుతున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 2 =