రోహిత్ శర్మకు సూచనలు చేసిన రవిశాస్త్రి

cricket, Cricketer Rohit Sharma, Ex-India coach Ravi Shastri shares thoughts on split captaincy, Former India Head Coach Ravi Shastri, Former India Head Coach Ravi Shastri Advice To Rohit Sharma, Mango News Telugu, ravi shastri, Ravi Shastri Advice To Rohit Sharma, Ravi Shastri has his say on split captaincy in Indian cricket, Ravi Shastri leaves special note, Rohit Sharma, Rohit Sharma always does what is best for the team, rohit sharma career, Rohit Sharma Indian cricket, Rohit Sharma Indian cricket Caption, sports news

భారత క్రికెట్ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ కు పలు సూచనలు చేసారు మాజీ కోచ్ రవిశాస్త్రి. విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ ను భారత క్రికెట్ కెప్టెన్ గా నియమించిన విషయం తెలిసిందే. కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్న రోహిత్ శర్మ కు రవిశాస్త్రి శుభాకాంక్షలు తెలియజేసారు. అదే సమయంలో అతడికి కొన్ని సలహాలు కూడా అందజేశారు. భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావటం అదృష్టమని.. దానిని ఒక బాధ్యతగా తీసుకోవాలని ఆయన చెప్పారు.

జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని కలుపుకుపోవాలని.. అది నాయకుడికి ఉండాల్సిన ప్రధమ లక్షణమని శాస్త్రి సూచించారు. ప్రతి ఆటగాడిని సమర్ధంగా ఉపయోగించుకోవాలని, అప్పుడే జట్టుకు విజయాలు లభిస్తాయని తెలిపారు. రోహిత్ ఆట మీద మాత్రమే దృష్టి పెట్టాలని, అనవసర విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదని ఆయన రోహిత్ కు సలహానిచ్చారు. ఈ విషయంలో ఇంతకుముందు పనిచేసిన కెప్టెన్లను చూసి నేర్చుకోవాలని ఆయన రోహిత్ కు సూచించారు.

అలాగే, రవిశాస్త్రి కోహ్లీ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఆటగాడు అని శాస్త్రి కితాబిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్ మన్ లలో కోహ్లీ ముందువరుసలో ఉంటాడని చెప్పారు. అతను సాధించిన రికార్డులే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. కానీ అందరూ, కెప్టెన్ గా అతను సాధించిన విజయాలనే గుర్తింస్తుంటారు అని చెప్పారు. టీమిండియా కు సారధ్యం వహించటం అనేది గొప్ప విషయమని, కోహ్లీ గొప్ప కెప్టెన్ అని రవిశాస్త్రి కొనియాడారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 9 =