కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు

Andhra Pradesh, Coronavirus, Covid B.1.1.529 variant, COVID-19, covid-19 new variant, face mask rule, Mango News, Mango News Telugu, New coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, New Guidelines Amid Omicron Threat, new variant of COVID-19, Omicron, Omicron covid variant, Omicron grips India, Omicron variant, omicron variant in India, omicron variant south africa, Telangana Omicron, Telangana Omicron News, Telugu States Increase Covid Tests, Telugu States Increase Covid Tests To Fight Against Omicron, Update on Omicron, World Health Organization

ప్రపంచ దేశాలలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా కట్టడిపై దృష్టి సారించాయి. తెలంగాణ రాష్ట్రంలో RTPCR టెస్టులు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో RTPCR టెస్టులు పెంచాలని అధికారులకు స్పష్టం చేసారు. ప్రస్తుతం చేసే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల ఫలితం 5 ని.లలో వస్తుంది. RTPCR టెస్ట్ ఫలితం రావటానికి 24 నుంచి 72 గంటల సమయం పడుతుంది. ఒమిక్రాన్ వేరియెంట్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని కేంద్రాలలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులతో పాటు RTPCR టెస్టులను కూడా పెంచాలని అధికారులు నిర్ణయించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కరోనా విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తీనుకుంటున్న చర్యలతోపాటుగా మరికొన్ని సూచనలు తెలియజేసింది. కరోనా వ్యాప్తి నివారణకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కుని ధరించటం తప్పనిసరి చేసింది. మాస్కు ధరించని వారికి 100 రూ. జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. మాస్కులు ధరిస్తేనే దుకాణాలలోకి అనుమతించాలని.. మాస్కులు ధరించని వారిని లోపలి అనుమతిస్తే, రూ. 10,000 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధిస్తామని యజమానులను హెచ్చరించింది. ఉల్లంఘనలు జరిగితే వ్యాపార సంస్థలను 2 రోజులు మూసివేయాలని నిర్ణయించారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీ లను ఆదేశించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + two =