న్యూజిలాండ్ తో వన్డే, టీ20 లకు భారత్ జట్టు ఎంపిక

2020 Latest Sport News, 2020 Latest Sport News And Headlines, India vs New Zealand, India vs New Zealand Match, India vs New Zealand Match Live Updates, latest sports news, latest sports news 2020, Mango News Telugu, Prithvi Shaw as Dhawan replacement for ODIs, Sanju Samson as Dhawan replacement in T20s, sports news

న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా భారత్ జట్టు ఇప్పటికే ఆక్లాండ్‌ చేరుకుంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. న్యూజిలాండ్ తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు భారత్ ఆడనుంది. ఈ సందర్భంగా న్యూజిలాండ్‌తో తలపడే భారత్ వన్డే, టీ20 జట్లను జనవరి 21, మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తుండగా శిఖర్ ధావన్‌ ఎడమ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 మ్యాచులకు ధావన్ ను ఎంపిక చేయలేదు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీ20 సిరీస్ కు ధావన్ స్థానంలో సంజు శాంసన్ ను, వన్డే సిరీస్‌కు పృథ్వీ షాను ఎంపిక చేసింది.

భారత్ టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివం దూబే, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, నవదీప్ సైని, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్.

భారత్ వన్డే జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివం దూబే, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ,, నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్, కేదార్ జాదవ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + two =