కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Mango News Telugu, Municipal Elections In Telangana, Municipal Elections Polling Started In Telangana, Political Updates 2020, Telangana Breaking News, Telangana Municipal Elections, Telangana Municipal Elections 2020, Telangana Municipal Elections Polling, Telangana Political Live Updates, Telangana Political Updates

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 9 కార్పోరేషన్, 120 మునిసిపాలిటీల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఏ పోలింగ్ బూత్ లోనూ ఇబ్బందులు తలెత్తకుండా బ్యాలెట్‌ పద్దతిలో ఓటింగ్‌ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నాగిరెడ్డి ప్రకటించారు. అలాగే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే దిశగా 50వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల మందికిపైగా ప్రజలు నేడు జరగబోయే ఓటింగ్ లో పాల్గొననున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ రోజు సెలవు ప్రకటించారు. ఇక కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో జనవరి 24న పోలింగ్ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియను జనవరి 25న చేపట్టనున్నారు.

మున్సిపల్ ఎన్నికల వివరాలు:               

ఎన్నికలు జరిగే మునిసిపాలిటీలు: 120
ఎన్నికలు జరిగే కార్పోరేషన్లు: 10
ఎన్నికలు జరిగే మొత్తం వార్డుల సంఖ్య: 2647
ఎన్నికలు జరిగే కార్పోరేషన్ల డివిజన్లు: 324
మునిసిపాలిటీలలో ఏకగ్రీవమైన వార్డులు: 80
కార్పోరేషన్లలో ఏకగ్రీవమైన వార్డులు: 3
మునిసిపాలిటీలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య: 11179
కార్పోరేషన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య: 2118
మునిసిపాలిటీ పరిధిలో పోలింగ్ స్టేషన్స్: 6188
కార్పోరేషన్ల పరిధిలో పోలింగ్ స్టేషన్స్: 1773
ఎన్నికల సిబ్బంది: 45,000
కౌంటింగ్ సిబ్బంది: 10000

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =