ఐపీఎల్‌ 2020 షెడ్యూల్ విడుదల, సెప్టెంబర్‌ 19న తోలి మ్యాచ్

CSK vs MI, First Match Between MI and CSK, First Match Starts Between MI and CSK on September 19, indian premier league, indian premier league 2020, indian premier league 2020 schedule, IPL 2020, IPL 2020 Full Schedule, ipl 2020 match list, IPL 2020 schedule, IPL 2020 Schedule Released, ipl 2020 time table, IPL schedule 2020, VIVO IPL 2020 Schedule

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 ప్రారంభానికి బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఐపీఎల్-2020‌ సెప్టెంబరు 19 నుంచి యూఏఈలోని అబుదాబి, షార్జా మరియు దుబాయ్‌ వేదికల్లో నిర్వహిస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం నాడు విడుదల చేసింది. ఇంతకు ముందులాగానే గత సీజన్ లో ఫైనల్ ఆడిన జట్టులే మళ్ళీ మొదటి మ్యాచ్ ఆడనున్నాయి. సెప్టెంబర్‌ 19న ముంబయి ఇండియన్స్‌ మరియు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య అబుదాబిలో జరిగే తొలి మ్యాచ్ తో క్రీడాభిమానులకు అత్యంత ఇష్టమైన ఐపీఎల్ ప్రారంభం కానుంది. ‌భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచులు రాత్రి 7.30 గంటలకు, ‌మరియు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్నాయి. ముఖ్యంగా శని, ఆదివారాల్లోనే మధ్యాహ్నం మ్యాచులు జరగనున్నాయి.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here