బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4: 16 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే…

Bigg Boss Season 4, bigg boss season 4 contestants, bigg boss season 4 contestants list, bigg boss season 4 in telugu, Bigg Boss Season 4 Telugu, bigg boss season 4 telugu contestants, BIGG BOSS Season 4 Telugu Episode Highlights, BIGG BOSS Season 4 Telugu Launch Episode, bigg boss telugu 4, Bigg Boss Telugu Season 4, bigg boss telugu season 4 contestants, bigg boss telugu season 4 contestants list

గత మూడు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను బిగ్‌బాస్ రియాలిటీ షో విశేషంగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 4 వ సీజన్ కూడా సెప్టెంబర్ 6, ఆదివారం నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి కూడా అగ్ర కథానాయకుడు, కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరిస్తున్నారు. 15 వారాల పాటుగా ఆసక్తికరంగా సాగే ఈ షో లో 16 మంది సభ్యులు బిగ్‌బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. సీజన్ 4 ప్రారంభ ఎపిసోడ్లో నాగార్జున ఒక్కో సభ్యున్ని ఆహ్వానించి, బిగ్‌బాస్ ఇంటిలోకి పంపారు.

ప్రారంభ ఎపిసోడ్ హైలైట్స్:

 • మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కాదంటూ కింగ్ నాగార్జున స్టేజి పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
 • ఈసారి ఈ కార్యక్రమంలో నాగార్జున డ్యూయల్ రోల్ చేశారు. హోస్ట్ గానే కాకుండా, తండ్రిగా కూడా మరో పాత్ర వేస్తూ అందరికంటే ముందుగా బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లి, అక్కడ అన్ని ప్రదేశాలను ఆడియన్స్ కు పరిచేయం చేశారు.
 • గత మూడు సీజన్ల కంటే బిగ్‌బాస్ హౌస్ ని ఈసారి మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు.
 • ఇక వరుసగా 16 మంది సభ్యులను ఆహ్వానించి బిగ్‌బాస్ హౌస్ లోకి పంపారు.
 • మొదటి కంటెస్టెంట్‌గా హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ హౌస్ లోకి ఎంటర్ అయింది.
 • 2 వ కంటెస్టెంట్‌గా దర్శకుడు‌ సూర్యకిరణ్‌ వచ్చారు.
 • 3 వ కంటెస్టెంట్‌గా యాంకర్‌ లాస్య హౌస్‌లోకి అడుగుపెట్టారు.
 • 4 వ కంటెస్టెంట్‌గా హీరో అభిజిత్‌ ఎంట్రీ ఇచ్చారు.
 • 5 వ కంటెస్టెంట్‌గా జోర్దార్ వార్తలతో పాపులర్ అయిన యాంకర్‌ సుజాత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
 • 6 వ కంటెస్టెంట్‌గా సోషల్ మీడియా స్టార్ మెహబూబా దిల్‌ సే ఎంట్రీ.
 • 7 వ కంటెస్టెంట్‌గా టీవీ 9 న్యూస్ యాంకర్‌ దేవి నాగవల్లి హౌస్‌లోకి అడుగుపెట్టారు.
 • 8 వ కంటెస్టెంట్ గా యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారిక ఎంట్రీ.
 • 9 వ కంటెస్టెంట్‌గా యాక్టర్ సయ్యద్ సోహైల్ రియాన్ వచ్చాడు.
 • 10 వ కంటెస్టెంట్‌గా యాంకర్‌ అరియానా గ్లోరీని ఆహ్వానించారు.
 • అయితే సోహైల్ రియాన్‌, అరియానా గ్లోరీలను నేరుగా బిగ్‌బాస్‌లోకి కాకుండా సీక్రెట్ నైబర్‌ బిగ్‌బాస్ హౌస్‌‌లోకి పంపించారు.
 • 11 వ కంటెస్టెంట్‌గా డాన్స్ మాస్టర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్‌ ఎంట్రీ ఇచ్చాడు.
 • 12 వ కంటెస్టెంట్‌గా నటి కరాటే కల్యాణి ఎంట్రీ ఇచ్చింది.
 • 13 వ కంటెస్టెంట్‌గా ర్యాప్ సింగర్ నోయల్ బిగ్‌బాస్ ‌లోకి అడుగుపెట్టాడు.
 • 14 వ కంటెస్టెంట్‌గా మోడల్, నటి దివి ఎంట్రీ.
 • 15వ కంటెస్టెంట్‌గా టీవీ నటుడు అఖిల్‌ సార్థక్ వచ్చాడు.
 • ఇక 16 వ కంటెస్టెంట్‌గా యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ గ్రాండ్‌ గా ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వను హౌస్ లోకి మిగతా సభ్యులంతా సాదరంగా ఆహ్వానించారు.
 • 15 వారాల పాటుగా ప్రేక్షకులను అలరించబోయే ఈ రియాలిటీ ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచిచూడాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here