క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ ప్రారంభం

BCCI IPL 2020, chennai super kings, First Match Between Mumbai Indians and Chennai Super Kings, IPL 2020, IPL 2020 In UAE, IPL 2020 Latest News, IPL 2020 Latest Updates, IPL 2020 Live Updates, IPL 2020 Match Dates, ipl 2020 match list, IPL 2020 News, IPL 2020 Starts, IPL 2020 Starts From Today, IPL 2020 Udpates, Mumbai Indians

క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 ఈ రోజే ఘనంగా ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్స్ ఒక ఎత్తు కాగా, ఐపీఎల్‌ 13వ సీజన్‌ మాత్రం కొంచెం ప్రత్యేకంగా నిలవనుంది. గత ఏప్రిల్ లోనే ఐపీఎల్ ప్రారంభం అవ్వాల్సి ఉండగా, కరోనా పరిస్థితుల వలన వాయిదా పడింది. దీంతో ఈ సీజన్ యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సీజన్ సెప్టెంబరు 19 న మొదలై నవంబర్ 10 న ఫైనల్స్ తో ముగియనుంది. అబుదాబి, షార్జా మరియు దుబాయ్‌ వేదికల్లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించనున్నారు.

తొలిసారిగా ప్రేక్షకులు లేకుండా మ్యాచులు జరగనున్నాయి. మరోవైపు కరోనా వలన బయటకి వెళ్లే పరిస్థితుల లేకపోవడంతో ప్రజలు టీవీ, ఓటిటి వినోదానికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో క్రీడాభిమానులను ఉర్రుతలూగించే ఐపీఎల్ పై గతంలో కంటే భారీ హైప్ నెలకుంది. ఈ రోజు భారత కాలమానం ప్రకారం 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్‌ మరియు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య అబుదాబిలో జరిగే తొలి మ్యాచ్ తో ఐపీఎల్‌-2020 మొదలవనుంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఐపీఎల్ సీజన్ ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ‌

ఐపీఎల్‌-2020 వివరాలు:‌

 • ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 19
 • ఫైనల్స్ – నవంబర్ 10
 • మ్యాచుల సమయాలు: మధ్యాహ్నం గం.3.30, రాత్రి గం.7.30
 • ఒక్కో జట్టు గరిష్ట పరిమితి : 24 మంది ఆటగాళ్లు, అన్ లిమిటెడ-కోవిడ్ సబ్‌స్టిట్యూట్‌ లు
 • వేదికలు: దుబాయ్, అబుదాబి, షార్జా

2008 నుంచి 2019 వరకు ఐపీఎల్ విన్నర్స్ జాబితా:

 • ఐపీఎల్ విజేత 2008: రాజస్థాన్ రాయల్స్
 • ఐపీఎల్ విజేత 2009: డెక్కన్ ఛార్జర్స్
 • ఐపీఎల్ విజేత 2010: చెన్నై సూపర్ కింగ్స్
 • ఐపీఎల్ విజేత 2011: చెన్నై సూపర్ కింగ్స్
 • ఐపీఎల్ విజేత 2012: కోల్‌కతా నైట్ రైడర్స్
 • ఐపీఎల్ విజేత 2013: ముంబై ఇండియన్స్
 • ఐపీఎల్ విజేత 2014: కోల్‌కతా నైట్ రైడర్స్
 • ఐపీఎల్ విజేత 2015: ముంబై ఇండియన్స్
 • ఐపీఎల్ విజేత 2016: సన్‌రైజర్స్ హైదరాబాద్
 • ఐపీఎల్ విజేత 2017: ముంబై ఇండియన్స్
 • ఐపీఎల్ విజేత 2018: చెన్నై సూపర్ కింగ్స్
 • ఐపీఎల్ విజేత 2019: ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2020 షెడ్యూల్:

 

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here