ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్ టెండూల్కర్‌ కి చోటు

Allan Donald inducted into ICC Hall of Fame, ICC Hall of Fame, ICC Hall of Fame Sachin Tendulkar among three new names inducted, Legendary cricketer Sachin Tendulkar inducted into ICC Hall of Fame, Mango News, Sachin Tendulkar 6th Indian to be inducted into ICC Hall of Fame, Sachin Tendulkar Inducted Into ICC Hall Of Fame, Tendulkar inducted into ICC Hall of Fame

క్రికెట్ దిగ్గజం, భారత బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. సచిన్ తో పాటు దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ అలన్ డోనాల్డ్‌ మరియు రెండుసార్లు ప్రపంచ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యురాలైన మహిళా క్రికెటర్ కాథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ కూడ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించారు. ఈ కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ ఇది తనకు చాలా పెద్ద గౌరవమని చెప్పాడు. ఇప్పటికే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత్ నుంచి అయిదుగు క్రికెటర్లు చోటు సాధించారు.

ఈ జాబితాలో ఉన్న ఇతర భారతీయులు బిషన్ సింగ్ బేడి (2009),కపిల్ దేవ్ (2009),సునీల్ గవాస్కర్ (2009), అనిల్ కుంబ్లే (2015), మరియు రాహుల్ ద్రవిడ్ (2018). ఈ జాబితాలో చోటు సంపాదించిన ఆరో భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్‌, ఈ గౌరవం ఇంతకుముందే సచిన్ కి దక్కలేదని క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసారు. ఎట్టకేలకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌ లో చోటు దక్కించు కోవడంతో అభిమానులు, ఇతర క్రికెటర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తు సచిన్ కి శుభకాంక్షలు తెలియజేస్తున్నారు. భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ, సచిన్ టెండూల్కర్ కి శుభాకాంక్షలు తెలియజేసి, చాలా అర్హుడని, క్రికెట్ ఆడుతున్నపుడే సచిన్ ఈ అర్హత కు దక్కాల్సిందని నమ్ముతున్నానని ట్వీట్ చేసాడు.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + ten =