ఆగస్ట్ 30 న సాహో విడుదల

2019 Latest Telugu Movie News, Mango News, Prabhas Saaho Gets A New Release Date, Prabhas Saaho release date postponed to August 30, Saaho Movie Is Officially Releasing On August 30, Saaho Movie Latest News, Saaho Movie Will Release On August 30, Saaho release date, Saaho Release Date Changed to August 30th, Saaho release date shifted to August 30, telugu film updates, Tollywood Cinema Latest News

బాహుబలి సీరీస్ అద్భుతమైన విజయం తరువాత, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముకేశ్,ఇతరులు నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మొదట ఆగస్టు 15 న ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల చేయడానికి నిర్ణయించారు, అయితే, ఇప్పుడు మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. సాహో సినిమా ఇప్పుడు ఆగస్టు 30 న ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల చేస్తునట్టు నిర్మాతలు ప్రకటించారు. సాహో సంచలనాలను వెండితెరపై చూడటానికి ప్రభాస్ అభిమానులు మరికొంత సమయం వేచి ఉండాలి.

చిత్రం విడుదల గురించి నిర్మాతలు మాట్లాడుతూ, “మేము ప్రేక్షకుల ముందుకు ఉత్తమమైన చిత్రం తీసుకురావాలనుకుంటున్నాము. యాక్షన్ సన్నివేశాలకు మరింత ఆకట్టుకునేలా చేసేందుకు మాకు మరికొంత సమయం కావాలి. మేము స్వాతంత్ర్య దినోత్సవం నుండి తేదీని మారుస్తున్నప్పటికీ, మేము స్వాతంత్ర్య మాసానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నాము. అతిపెద్ద సినిమాను అతిపెద్ద స్థాయిలో తీసుకురావడానికి మేము అంకితభావంతో ఉన్నామని ”  చెప్పారు. హిందీ, తెలుగు,తమిళ్ భాషల్లో ఏకధాటిగా నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here