చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో మరో ఆటగాడికి కరోనా పాజిటివ్?

2020 Indian Premier League, Chennai Super Kings Player, Chennai Super Kings Player Test Positive, Chennai Super Kings Player Test Positive For Coronavirus, indian premier league, indian premier league 2020, IPL, IPL 10 Staff Members Test Positive For Coronavirus, IPL 2020, IPL 2020 News, IPL 2020 Updates

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 లో పాల్గొనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో శుక్రవారం నాడు ఓ బౌలర్ మరియు 10 మంది సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జట్టులో మరో ఆటగాడికి కరోనా సోకింది. జట్టు సభ్యులకు శుక్రవారం నాడు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించడంతో యువ బ్యాట్స్ మెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌కు పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది. కాగా ఈ అంశంపై సీఎస్కే యాజమాన్యం అధికారికంగా స్పందించాల్సి ఉంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరిగే ఐపీఎల్ లో పాల్గొనేందుకు యూఏఈ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఓవైపు జట్టులో ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండడంతో క్వారంటైన్ సమయం పెరుగుతుండగా, మరోవైపు జట్టులో కీలక ఆటగాడు సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకుని ఇండియాకి చేరుకున్నారు. ఈ సీజన్ మొత్తానికి సురేశ్ రైనా దూరమయినట్టు సీఎస్కే సీఈవో కె.ఎస్ విశ్వనాథన్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here