ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం వద్ద ‘మహాకాల్ లోక్ కారిడార్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Inaugurates The First Phase of Mahakal Lok Corridor at Mahakaleshwar Temple in Ujjain, PM Modi To Inaugurate 900-Metre Mahakal Lok, Ujjain To Witness Historic Moment, PM Modi In Ujjain, Mahakal Lok Corridor Opening In Ujjain, Mango News, Mango News Telugu, PM Modi To Inaugurate Mahakal Lok In Ujjain, PM Modi Mahakal Lok Ujjain Inauguration, Ujjain's Mahakal Corridor, Aerial View Of Mahakal Lok Corridor, Mahakal Lok Corridor, Indian Prime Minister Narendra Modi, PM Modi Latest News And Updates, PM Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం వద్ద రూ. 850 కోట్లకు పైగా నిధులతో నిర్మిస్తున్న ‘మహాకాల్ లోక్ కారిడార్’ ప్రాజెక్ట్ ఫేజ్ 1ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మహాకాళ ఆలయానికి సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ప్రధాని మోదీ.. నంది ద్వార్ నుండి మహాకాళ లోక్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా దేవదేవునికి ప్రత్యేక పూజ నిర్వహించి హారతి ఇచ్చారు. మంత్రోచ్ఛారణల మధ్య కొద్దిసేపు నంది విగ్రహం దగ్గర కూర్చొని ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రితో పాటు మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉజ్జయినిలోని ప్రతి కణంలో ఆధ్యాత్మికత ఉందని, అలాగే ప్రతి దిక్కులో దైవిక శక్తి ప్రసరిస్తున్నదని అన్నారు. ఉజ్జయిని వేల సంవత్సరాలుగా భారతదేశం యొక్క జ్ఞానం సాహిత్యానికి నాయకత్వం వహించిందని పేర్కొన్నారు. పునరుద్ధరణతో సరికొత్త ఆవిష్కరణ వస్తుందని, భారతదేశం బానిసత్వ యుగంలో కోల్పోయిన దానిని ఇప్పుడు పునర్నిర్మించుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. అలాగే ఆజాదీ కా అమృత్‌కాల్ సందర్భంగా మనం వలసవాద సంకెళ్లను తెంచుకున్నామని, నేడు భారతదేశం అంతటా సాంస్కృతిక గమ్యస్థానాలు సర్వతోముఖాభివృద్ధిని చూస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా, చార్ ధామ్‌లు అన్ని వాతావరణ రహదారులతో అనుసంధానించబడ్డాయని, గణనీయ అభివృద్ధి చెందాయని ప్రధాని మోదీ ప్రకటించారు.

కాగా మహకాల్ లోక్ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాలను అందించడం ద్వారా ఆలయాన్ని సందర్శించే యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రాజెక్ట్ మొత్తం ప్రాంతాన్ని రద్దీని తగ్గించడం మరియు వారసత్వ నిర్మాణాల పరిరక్షణ మరియు పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టు కింద ఆలయ ప్రాంగణాన్ని దాదాపు ఏడు రెట్లు విస్తరించనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.856 కోట్లు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం ఏడాదికి 1.5 కోట్ల మంది వస్తున్న భక్తుల సంఖ్యా రెట్టింపు అవుతుందని అంచనా. ఇక ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి రెండు దశల్లో ప్రణాళిక చేయబడింది. మహాకాల్ మార్గంలో మొత్తం 108 నిలువెత్తు స్తంభాలు ఉన్నాయి. ఇవి పరమశివుని ఆనంద తాండవ స్వరూపం (నృత్య రూపం)లో దర్శనమిస్తాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 18 =