విశాఖ నగర అభివృద్ధిపై సమీక్ష చేసిన సీఎం జగన్

AP CM YS Jagan Review Meeting, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, Visakhapatnam City Development, Visakhapatnam Development Works, YS Jagan Latest Political News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి డిసెంబర్ 3, మంగళవారం నాడు విశాఖ నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో విశాఖ నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా రోడ్లు, త్రాగునీరు ప్రాజెక్టులపై చర్చించారు. అలాగే విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, మెట్రో రైల్‌ మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదనలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. మొదటి విడతలో 46.40 కి.మీలకు సంబంధించిన మెట్రోరైల్‌ కారిడార్ ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు.

స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు 34.23 కి.మీ, గురుద్వార నుంచి ఓల్డ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ 5.26 కి.మీ, తాడిచెట్ల పాలెం నుంచి ఆర్కే బీచ్‌ వరకు 6.91 కి.మీతో కూడిన మొదటి దశ మెట్రో రైలు ప్రతిపాదనలపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మెట్రో రైల్‌ మోడళ్లను అధికారులు సీఎంకు చూపించారు. 2020-24 మధ్య కాలంలో ఈ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రతిపాదించారు. మరోవైపు నగరంలో నీటి సమస్యపై చర్చిస్తూ, పోలవరం వద్దే నీటిని ఫిల్టర్‌ చేసి అక్కడి నుంచి విశాఖ నగరానికి తరలించేలా చేయాలని సీఎం సూచించారు. ఈ అంశాన్ని వాటర్‌ గ్రిడ్‌లో భాగంగా చేపట్టే విధానంపై చర్చించారు. నగరంలో రోడ్లు అన్ని బాగు చేయాలని, అలాగే అన్ని ప్రాంతాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటుకూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే బీచ్‌రోడ్డులో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంపై కూడా అధికారులుకు సీఎం వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 20 =