అన్నాత్తె మూవీ టీమ్‌కు గిఫ్ట్స్ ఇచ్చిన రజనీకాంత్

Annaatthe Movie, Annaatthe Movie News, Annaatthe Movie Updates, Mango News, Rajinikanth Annaatthe Movie, Rajinikanth Gifts Gold Chain, Rajinikanth gifts gold chain to the crew, Rajinikanth gifts gold chain to the crew of Annaatthe, Rajinikanth Gifts Gold Chain to The Technical Team, Rajinikanth Gifts Gold Chain to The Technical Team of Annaatthe Movie, Superstar Rajinikanth, Superstar Rajinikanth’s big surprise for Annaatthe team, Technical Team of Annaatthe Movie

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తె’ (పెద్దన్న) తో భారీ విజయం దక్కించుకున్నారు. ఆ సినిమా దర్శకుడు శివకు ఆ మధ్య బంగారు చెయిన్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు రజనీకాంత్. ఇప్పుడు ‘అన్నాత్తె’ టీమ్‌ సభ్యులందరికీ విలువైన కానుకలిచ్చాడు. ఈ సినిమా రిలీజై 50 రోజులైన సందర్భంగా.. ‘అన్నాత్తె’ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌తో పాటు ఇతర టెక్నీషియన్లందరికీ గోల్డ్ చైన్స్ బహుమతిగా అందించాడు రజనీ. తమను గుర్తించి ఇలా సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు ఇవ్వడంపై టెక్నీషియన్లు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కొద్దీ రోజుల క్రితం రజనీకాంత్, డైరెక్టర్‌ శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘అన్నాత్తై’ చిత్రం తెలుగులో కూడా ‘పెద్దన్న’ గా విడుదలైంది. ఈ సినిమాలో రజనీ స‌ర‌స‌న హీరోయిన్‌గా నయనతార నటించింది. మరో హీరోయిన్ కీర్తి సురేశ్‌ సోదరి పాత్రలో కనిపించింది. ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెలుగులో కన్నా త‌మిళంలో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. తమిళనాట మంచి హిట్ సినిమాగా నిలిచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 5 =