ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ,కేబినెట్ ఆమోదం

AP Cabinet Approves Formation of Committee on Establishment of New Districts

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 25 జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాల కనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నేతృత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు కానుంది. అలాగే జిల్లాల ఏర్పాటు పక్రియను వచ్చే సంవత్సరం మార్చ్ 31 లోగా పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 5 =