అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్, ఆందోళన చెందవద్దని అభిమానులకి విజ్ఞప్తి

Actor Allu Arjun, Allu Arjun, Allu Arjun movies, Allu Arjun Pushpa Movie, Allu Arjun Tested Positive, Allu Arjun Tested Positive for Covid-19, Allu Arjun tests Covid positive, Allu Arjun Tests Positive for Coronavirus, Allu Arjun tests positive for Covid-19, Hero Allu Arjun, Mango News

దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ యువ కథానాయకుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “అందరికీ హలో! నాకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నాను. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్నవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. నేను బాగానే ఉన్నాను. శ్రేయోభిలాషులు మరియు అభిమానులు ఆందోళన చెందవద్దని కోరుతున్నాను. ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి. అలాగే అవకాశం రాగానే కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + nine =