ఉప్పు వల్ల బీపీనే కాదు.. మధుమేహం కూడా వస్తుందంట..

Salt causes not only BP but also diabetes,Salt causes not only BP,Salt causes diabetes,Salt and diabetes,Salt and hypertension in diabetes,Blood pressure,Insulin production,sugar, salt,Mango News,Mango News Telugu, diabetes, Salt causes not only BP, Salt causes also diabetes,Salt and diabetes Latest News,Salt and Diabetes Latest Updates,Diabetes Latest News,Diabetes Latest Updates
Blood pressure,Insulin production,sugar, salt, diabetes, Salt causes not only BP, Salt causes also diabetes

వంటకాల్లో రుచిని పెంచడంలో ఉప్పుదే ప్రధమస్థానం అంటే అంతా ఒప్పుకోవాల్సిందే. అందుకే చాలా మంది కూరల్లో కాస్త ఉప్పు తక్కువ అయినా సరే.. మళ్లీ ఉప్పును కలుపుకొని  ఆ తర్వాతే తింటారు.  అంతగా  ఉప్పు రుచికి అలవాటు పడిపోతారు. అయితే ఉప్పును ఎక్కువగా తీసుకుంటే  బీపీ వస్తుందని.. ఒకవేళ బీపీ ఉంటే  వారిలో బ్లడ్  ప్రెజర్‌ను  పెంచుతుందని అందరికీ తెలిసిందే. కాకపోతే ఉప్పు ఎక్కువగా వాడితే బీపీనే  కాదట.. డయాబెటిస్ బారిన పడటం పక్కా అని  నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కూరలో కారం నుంచి  ఎన్ని మసాలా దినుసులు వేసి శ్రద్ధగా చేసినా ఉప్పు వేయకపోతే దానికి ఆ రుచే ఉండదు. కొంతమంది అయితే పెరుగన్నంలోనే కాదు.. కూరల్లో, రసం వంటివాటిలో కాస్త ఉప్పు తక్కువైనా కలుపుకోవడానికి భోజనం తినేటప్పుడు  సాల్ట్‌ను  కూడా తెచ్చి పెట్టుకుంటారు. ఉప్పు కరెక్టుగా తింటే ఏ సమస్యా ఉండదు కానీ..ఎక్కువగా తింటేనే అన్ని సమస్యలు  వస్తుంటాయి. అందుకే చాలామంది ఇప్పుడిప్పుడే ఉప్పును తగ్గించి తింటున్నారు

ఉప్పును అధికంగా తినేవారిలో రక్తపోటు సమస్య వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కొత్తగా ఉప్పును ఎక్కువగా తింటే డయాబెటిస్ -2 టైప్ బారిన పడతామని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పు పొంచి ఉందని పరిశోధనలో తేలింది.షుగర్, ఫ్రూట్ జ్యూసులు, స్వీట్స్ తో డయాబెటిస్ వస్తుందని విషయం తెలిసిందే. అయితే  తాజాగా ఉప్పు ద్వారా కూడా మధుమేహం వస్తుందని.. మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ద్వారా వెల్లడి అయింది.

మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురించబడిన  అధ్యయనం ప్రకారం.. రోజుకు రెండు టీ స్పూన్ల సాల్ట్‌ను తీసుకునే వారిలో మధుమేహం ముప్పు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ఉప్పు ఇన్సులిన్ ప్రొడక్షన్‌కు అడ్డుపడటంతోనే మధుమేహం బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

కొంతమంది భోజనం చేసినప్పుడు టేబుల్ సాల్ట్ వాడతారని.. దీని వల్లే ఎక్కువగా టైప్ 2 డయాబెటిస్ 40 శాతం పెరిగే అవకాశం ఉందని కొత్త పరిశోధనలో తేలినట్లు.. తులనే యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం  ప్రకారం..యూకే బయోబ్యాంక్ నుంచి 37 నుంచి 73 సంవత్సరాల మధ్య వయస్సు గల పదివేల మంది  డేటాను పరిశోధకులు  పరిశీలించారు. దీనిని ఐదు మిలియన్లకు పైగా బ్రిటిష్ ప్రజల జీవన శైలితో అప్పటి వైద్య విధానంతో పోల్చి చూశారు.  దీంతో 12 సంవత్సరాల తరువాత 13 వేల మందికి పైగా ప్రజలు టైప్-2 డయాబెటిస్ కలిగి ఉన్నారని అధ్యయన కర్తలు తేల్చారు.

ఎక్కువగా ఉప్పును తీసుకోవడం వల్ల వెయిట్ పెరగడంతో పాటు, గుండె సంబంధించిన రోగాలు కూడా వచ్చే అవకాశముందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఉప్పుతో డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం రోజు.. 150 మి. గ్రా లకు మించి ఉప్పును వినియోగించడకూడదని నిపుణులు చెబుతున్నారు.బయటఫుడ్ కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఉప్పుకు బదులు మిరియాల పొడిని వాడితే  ఆరోగ్యం బాగుంటుంది పైగా  ఉప్పు సరిపోలేదన్న ఫీలింగ్ తగ్గుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =