తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటయ్యారు.. ధ్వజమెత్తిన హరీష్ రావు

All the opponents of Telangana are united Harish Rao who raised the flag,All the opponents of Telangana,opponents of Telangana are united,Harish Rao who raised the flag,Mango News,Mango News Telugu,The rise of KTR & Harish Rao,harish rao, harish rao comments, telangana politics, chandrababu naidu, pawan kalyan, sharmila,Telangana Latest News And Updates, Telangana Political News And Updates,Hyderabad News,Harish Rao Latest News,Harish Rao Latest Updates
harish rao, harish rao comments, telangana politics, chandrababu naidu, pawan kalyan, sharmila

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో.. జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈసారి ఫుల్ జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. దూకుడుగా ముందుకెళ్తోంది. ఎలాగైనా అధికారంలోకి రావాడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అటు గులాబీ బాస్.. రోజుకు, రెండు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ హోరెత్తిస్తున్నారు. మంత్రులు హరీష్‌రావు,కేటీఆర్‌లు తీరిక లేకుండా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు పేలుస్తున్నారు.

శుక్రవారం సిద్ధిపేటలో నిర్వహించిన ప్రచారంలో.. హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్‌గా చేసుకొని కామెంట్లు చేశారు. అంతేకాకుండా.. చంద్రబాబు నాయుడు, వైఎస్ షర్మిల, పవన్ కల్యాణ్‌లను కూడా వదలకుండా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన టీడీపీ, వైఎస్సార్‌టీపీ.. ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ పోటీ చేయకుండా చంద్రబాబు.. కాంగ్రెస్‌కు మద్ధతు ఇస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

అటు తెలంగాణ రాకుండా అడ్డుపడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కూడా కాంగ్రెస్‌కు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ద్రోహులని.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారని మండిపడ్డారు. ఎన్నికలవేళ తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారని ఆరోపించారు. అటు తెలంగాణ వస్తే 11 రోజుల పాటు తినకుండా పవన్ కల్యాణ్ బాదపడ్డారని హరీష్ రావు చెప్పుకొచ్చారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణకు వచ్చి.. బీజేపీతో ఏవిధంగా పొత్తు పెట్టుకుంటారని నిలదీశారు.

అయితే అటు కాంగ్రెస్.. తెలంగాణ ఇచ్చింది మేమేనని చెప్పుకొస్తోంది. ఇబ్బందులు ఉన్నప్పటికీ సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని పదే పదే చెబుతోంది. ఈ విషయాన్నే జనాల్లోకి తీసుకెళ్తోంది. అయితే దీనికి కౌంటర్‌గా హరీష్ రావు.. కాంగ్రెస్ నేతలంతా తెలంగాణ వ్యతిరేకులనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 14 =