నల్గొండ జిల్లాకు రూ.18000 కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే పోటీనుండి తప్పుకుంటాం, బీజేపీ సిద్ధమా?: మంత్రి కేటీఆర్

Minister KTR Challenges BJP that TRS Won't Contest in Munugode if PM Modi can Announce Rs 18000 Cr Package to Nalgonda District, Minister KTR Challenges BJP , TRS Won't Contest in Munugode, PM Modi can Announce Rs 18000 Cr Package to Nalgonda District, Mango News, Mango News Telugu, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా బీజేపీని నిలదీశారు. “నీతి ఆయోగ్ ఫ్లోరోసిస్ నిర్మూలణ కోసం మిషన్ భగీరథకి 19,000 కోట్లు కేటాయించమని సిఫార్సు చేస్తే పెడచెవిన పెట్టారు. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికీ రూ.18,000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ నల్గొండ జిల్లాకు రూ.18,000 కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే పోటీనుండి తప్పుకుంటాం. బీజేపీ సిద్ధమా?” అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

అలాగే ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరగదు, మరొక వ్యక్తికీ కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదని మంత్రి అన్నారు. రాజకీయ ప్రయోజనం కాదు, నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యమన్నారు. గుజరాత్ కు గత ఐదు నెలల్లో రూ.80,000 కోట్ల ప్యాకేజీలు ఇచ్చారని, తెలంగాణకు కనీసం రూ.18,000 కోట్లు ఇవ్వలేరా? అని ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + four =