హుజురాబాద్ లో 23,855 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్

BJP Candidate Eatala Rajender Won, BJP Candidate Eatala Rajender Won in Huzurabad By-election, Eatala Rajender Won in Huzurabad, Eatala Rajender Won in Huzurabad By-election, Huzurabad Assembly Election Results, Huzurabad Assembly Election Results 2021, Huzurabad By-election Votes Counting Live Updates, Huzurabad bypoll, Huzurabad bypoll results, Huzurabad bypoll results live updates, Huzurabad constituency, Huzurabad Election Results 2021, huzurabad election results exit poll, huzurabad exit poll 2021, Huzurabad exit poll results, huzurabad results, Mango News

హుజురాబాద్ ఉపఎన్నికపై తెలంగాణలో విస్తృతమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో చేరింది మొదలు, పోలింగ్ వరకు హుజురాబాద్ ఉపఎన్నిక వార్తల్లో కీలకంగా నిలిచింది. కాగా ఈ ఉపఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన టీఆర్ఎస్, బీజేపీ పార్టీలలో చివరకు తిరుగులేని విధంగా బీజేపీ పార్టీ పైచేయి సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 23,855 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. రెండు రౌండ్స్ లో తప్ప కౌంటింగ్ మొదటినుంచి ఆధిపత్యాన్ని చూపిస్తూ, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయంవైపు దూసుకొచ్చారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కనీస స్థాయిలో కూడ ప్రభావం చూపలేక పోయింది. పోస్టల్ ఓట్లతో కలుపుకుని మొత్తం 2,05,965 ఓట్లు పోల్ అవగా, బీజేపీకి 1,07,022, టీఆర్ఎస్ కు 83167, కాంగ్రెస్ కు 3014 ఓట్లు లభించాయి.

ఈ ఎన్నికల బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్, బీజేపీలు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో తుది ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. నియోజకవర్గంలో ఈటల వ్యక్తిగత ఇమేజ్, బీజేపీ కార్యకర్తల మద్ధతు, పాదయాత్ర సహా పక్క ప్రణాళిక, ప్రత్యేకమైన పోల్ మేనేజ్ మెంట్ తో ఈ పోరులో బీజేపీ పార్టీ అద్భుత విజయాన్ని దక్కించుకుంది. ఈటల రాజేందర్ గెలుపుతో బీజేపీ పార్టీలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన సంబరాల్లో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. రాష్ట్ర మరియు కరీంనగర్ జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ, ఆనందంలో మునిగిపోయారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =