10 మంది సిట్టింగ్‌ ఎంపీలను మార్చే యోచనలో బీఆర్ఎస్

BRS, BRS Plans to Change 10 Sitting MP's, 10 Sitting MP's, KCR, BRS, BRS Sitting MPs, Telangana, Lok Sabha Polls, KTR, BRS MPs, Telangana News Updates, Telangana News, Telangana Political News, TRS Party, Mango News Telugu, Mango News
KCR, BRS, BRS Sitting MPs, Telangana

లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ నుంచి బలమైన సంకేతాలు అందుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు వరుసగా అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. మూడోసారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. అటు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి అయినా గద్దె నెక్కాలని ఆశపడుతోంది. ఇటు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయో లేదో.. లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారం చేజార్చుకున్న బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లోనైనా అత్యధిక స్థానాలు దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. 17 స్థానాల్లో కనీసం 12 స్థానాలు అయినా గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సరికొత్త వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సన్నాహక సమావేశాలను బీఆర్ఎస్ నిర్వహించింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి.. కార్యకర్తలు, క్యాడర్ అభిప్రాయాలను తెలుసుకుంది. అలాగే ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై కేడర్, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది.

అయితే ముందు నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటమి కారణం అభ్యర్థులేనని గట్టిగా వినిపిస్తోంది. అభ్యర్థులను మార్చకపోవడం.. నెగిటివిటీవున్న అభ్యర్థులకు, ప్రజాబలం తగ్గిన వారికే మరోసారి టికెట్ ఇవ్వడం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలయిందనే మాటలు చాలా మంది నోట వినిపించాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో కూడా కార్యకర్తలు.. అధిష్టానానికి అదే విషయం చెప్పారట. లోక్‌సభ ఎన్నికల్లోనైనా అభ్యర్థులను మార్చాలని.. ప్రజాబలం తగ్గిన సిట్టింగ్‌లను ఛేంజ్ చేసి కొత్త వారిని రంగంలోకి దింపాలని సూచించారట.

అయితే కార్యకర్తల అభిప్రాయాలతో బీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఏకీభించింది. ఈక్రమంలో సిట్టింగ్‌లను మార్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 17 సిట్టింగ్ స్థానాలు ఉండగా.. అందులో కనీసం 10 స్థానాల్లో అయినా సిట్టింగ్‌లను మార్చేందుకు బీఆర్ఎస్  కసరత్తు చేస్తోందట. 10 స్థానాల్లో సిట్టింగ్‌లకు బదులుగా కొత్తవారిని, బలమైన నేతలను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తోందట. మరి ఏయో స్థానాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్‌లను మారుస్తుందనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =