ఎక్కువ ఉద్యోగులకు ప్రమోషన్లు రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం, 31లోగా పూర్తి కావాలి: సీఎస్

3 Member Committee, 3 Member Committee Headed CS Somesh Kumar, Central Team Met Telangana CS Somesh Kumar, CS Somesh Kumar, CS Somesh Kumar Meeting, Employee Associations on PRC, Implement PRC, Mango News, Pay revision for employees, PRC Committee, PRC Committee Report, PRC report, Somesh Kumar Review Meeting on Employees Promotions, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Review Meeting, Telangana PRC report, TS PRC Report Telangana

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం జనవరి 31 లోపు పదోన్నతుల(ప్రమోషన్ల) ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం నాడు బిఆర్కె ఆర్ భవన్ లో ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో శాఖల వారీగా జరుగుతున్న పదోన్నతులను సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షించారు. ప్రమోషన్ల విషయం అత్యంత ప్రాధాన్యత గల అంశమని, ఎక్కువ మంది ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. తదనుగుణంగా వివిధ కేటగిరీలలో ఏర్పడిన పదోన్నతుల ఖాళీలను భర్తీ చేయుటలో ఎదురవుతున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పదోన్నతులు ఇచ్చుటకు ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశించారు. పదోన్నతుల అంశముపై శాఖాధికారులతో సమావేశములు నిర్వహించాలని కోరారు.

ఈ సమావేశంలో కార్మిక, ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఇరిగేషన్ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డిజి (లా అండ్ ఆర్డర్ జితేందర్, కార్యదర్శులు రిజ్వీ, బి.వెంకటేశం, సందీప్ కుమార్ సుల్తానియా, జనార్దన్ రెడ్డి, అహ్మద్ నదీమ్, అనీల్ కుమార్, దివ్య, నీతూప్రసాద్, క్రిస్టినా చోంగ్తు మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =