ఫిబ్రవరి 5న సీఎం కేసీఆర్ అధ్యక్షతన నాందేడ్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, ఏర్పాట్లు ప‌రిశీలించిన నేతలు

BRS Public Meeting to be held in Nanded on February 5th Leaders Reviewed the Arrangements,BRS Public Meeting Nanded,BRS Public Meeting,BRS Public Meeting in Nanded,Mango News,Mango News Telugu,BRS Party Public Meeting Latest News and Updates,BRS Party Nanded Public Meeting,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే దిశగా భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) పార్టీ వడివడిగా అడుగులు వేస్తుంది. ఇటీవలే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌ సహా పలువురు జాతీయ నేతల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఖమ్మంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ రెండవ బహిరంగ సభకు వేదిక సిద్దమవుతుంది. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఫిబ్రవరి 5వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ రెండవ బహిరంగ సభ జరగనుంది. నాందేడ్ బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌ లో చేర‌నున్నట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో నాందేడ్ లో జరగనున్న సభ ఏర్పాట్లను శనివారం బీఆర్ఎస్ పార్టీ నేతలు పరిశీలించారు. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, జోగు రామ‌న్న‌, హ‌న్మంత్ షిండే, సివిల్ సప్ల‌యి కార్పొరేష‌న్ చైర్మ‌న్ ర‌వీంద‌ర్ సింగ్ లు, నాందేడ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స‌భా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.

మరోవైపు నాందేడ్ స‌భ స‌న్నాహకాల్లో భాగంగా మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కూడా శనివారం మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్ లో ప‌ర్య‌టించారు. తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాలనే బీఆర్ఎస్ ఏర్పాటైందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. దేశానికి దిశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్‌ ఎదగనుందని, నాందేడ్ స‌భ‌కు భారీగా త‌ర‌లి వ‌చ్చి విజ‌య‌వంతం చేయాల‌ని అక్కడి ప్రజలను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − one =