బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్, రైతుబంధు అమలు చేస్తాం – ఖమ్మం సభలో సీఎం కేసీఆర్

CM KCR Announces If BRS Comes to Power Will Implement Free Electricity and Rythu Bandhu Across The Country,CM KCR Inaugurates Khammam District Integrated Offices' Complex, CM's Kejriwal, pinarayi Vijayan, Bhagwant Mann Attends,Mango News,Mango News Telugu,BRS Party Public Meeting,BRS Party Khammam Public Meeting,CM Kejriwal,CM Vijayan,CM Bhagwantman,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్, రైతుబంధు పథకాలు అమలు చేస్తామని ఖమ్మం సభలో ఆయన స్పష్టం చేశారు. అలాగే దశాబ్దాలుగా అధికారం పంచుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక నేటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాష్ట్రానికి విచ్చేసిన మూడు రాష్ట్రాల (కేరళ, ఢిల్లీ, పంజాబ్‌) ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మం సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..

 • మన దేశంలో సాగుభూమి, జలవనరులు కావాల్సినంత ఉంది, కానీ వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం.
 • దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటే.. అందులో కేవలం 20వేల టీఎంసీల నీరు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం.
 • ఈ వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటే.. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఎందుకు వస్తుంది?
 • కెనడా దేశం నుంచి కందిపప్పు, లక్ష కోట్ల విలువైన పామాయిల్ దిగుమతి చేసుకునే దుస్థితిలో ఉన్నాం.
 • ఇక మన దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే.. అందులో కేవలం 2.10 లక్షల మెగావాట్ల విద్యుత్ మాత్రమే వాడుకోగలుగుతున్నాం.
 • విద్యుత్ రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టార్ లోనే ఉంచాలనేది మా ప్రధాన డిమాండ్.
 • బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్, రైతుబంధు అమలు చేస్తాం.
 • అలాగే దళితబంధు పథకాన్ని ఏడాదికి 25 లక్షల కుటుంబాలకు అందజేస్తాం.
 • మరో ముఖ్యమైన విషయం.. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తాం.
 • నేటి దేశ పరిస్థితికి కారణం.. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలే.
 • ప్రధాని మోదీ సిద్ధాంతం ప్రైవేటైజేషన్ అయితే మాది నేషనైలేజషన్.
 • 2024 తర్వాత మోదీ ప్రభుత్వం ఇంటికి వెళ్తుంది.. అదే సమయంలో మేము ఢిల్లీకి వెళ్తాం.
 • కేంద్రం దుర్మార్గాలను అడ్డుకునేందుకు ప్రజలు విపక్షాలను ఆదరించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here