ప్రతినెలా పల్లెల అభివృద్దికి రూ.339 కోట్లు, పట్టణాల అభివృద్ధికి రూ.148 కోట్లు: సీఎం కేసీఆర్

2021, CM KCR, CM KCR Greeted People on the Occasion of National Panchayati Raj Day, kcr latest news, KCR National Panchayati Raj Day Whishes, Mango News, National Panchayati Raj Day, National Panchayati Raj Day 2021, National Panchayati Raj Day Ministry of Panchayati Raj, Panchayati Raj Day, Panchayati Raj Day 2021, Panchayati Raj Day Whishes, Telangana CM KCR, Telangana Panchayat, Telangana Panchayat Raj Act, Telangana Panchayat Raj Minister, Telangana Panchayat Raj Minister Errabelli Dayakar Rao

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినపుడే, ప్రజల సహకారంతోనే పాలనావ్యవస్థ ప్రగతిపథంలో ముందడుగు వేస్తుందని సీఎం అన్నారు. స్వాతంత్య్ర అనంతరం భారత దేశంలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే మహోన్నత లక్ష్యంతో నాటి సోషల్ ఇంజనీర్ గా ప్రసిద్ది పొందిన సురీందర్ కుమార్ డే (ఎస్.కె.డే) పంచాయతీరాజ్ వ్యవస్థకు అంకురార్పణ చేశారన్నారు. ప్రజలు తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే స్వయం సహకార ఉద్యమంలో భాగంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ భారతదేశంలో రూపుదిద్దుకున్నదని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచింది:

కమ్యునిటీ డెవలప్ మెంట్ లో భాగంగా రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ది జరుగాలనే నాటి ఎస్.కె.డే ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచిందని సీఎం అన్నారు. ఎవరి గ్రామాన్ని వారే తీర్చిదిద్దుకునే విధంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ పల్లెల్లో పాలనావ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసిందని తెలిపారు.

ప్రతినెలా పల్లెల అభివృద్దికి రూ.339 కోట్లు, పట్టణాల అభివృద్ధికి రూ.148 కోట్లు:

పల్లెల అభివృద్దికిగాను ప్రతినెలా రూ.339 కోట్లు, పట్టణాల అభివృద్ధికి ప్రతినెలా రూ.148 కోట్లు క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి సహా ఇతర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదాన్ని సంతరించుకుని అభివృద్ది పథంలో నడుస్తున్నయన్నారు. దేశంలో మరే రాష్ట్రం అందుకోని విధంగా తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత అనేక జాతీయ అవార్డులు, ప్రశంసలను అందుకుంటున్నదన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతున్నదనడానికి ఈ అవార్డులు ప్రశంసలు నిదర్శనంగా నిలిచినాయని సీఎం తెలిపారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధితో పాటు గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు సబ్బండ వర్గాలను అభివృద్దిలో భాగస్వాములను చేస్తున్నాయన్నారు. తద్వారా నాటి ఎస్.కె.డే కలలు కన్న పంచాయతీ రాజ్ సహకార వ్యవస్థ లక్ష్యాలను సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో వున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =