గులాబి కండువా కప్పుకున్న కాసాని జ్ఞానేశ్వర్

Kasani Gnaneshwar wearing a pink scarf,Kasani Gnaneshwar wearing,wearing a pink scarf,Gnaneshwar wearing a pink scarf,Mango News,Mango News Telugu,brs, kcr, kasani gnaneshwar, telangana politics,Kasani Gnaneshwar Mudiraj Resigned,Kasani Gnaneshwar Sensational Comments,Kasani Gnaneshwar joined BRS,Kasani Gnaneshwar Latest News,Kasani Gnaneshwar Latest Updates,Kasani Gnaneshwar Live News,Telangana assembly elections Latest Updates
brs, kcr, kasani gnaneshwar, teangana politics

కాసాని జ్ఞానేశ్వర్.. కొద్దిరోజులుగా తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇటీవలే ఆయన టీడీపీ పార్టీకి.. అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో గుర్రుగా ఉన్న కాసాని.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అంతకంటే ముందు నుంచే కాసాని బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమయింది. అందరు అనుకున్నట్లుగానే.. కాసాని జ్ఙానేశ్వర్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరిపోయారు.

తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. దాదాపు 50 లక్షల మంది ముదిరాజ్ సమాజాకి వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. ఎన్నికలవేళ ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి హామీలు గుప్పిస్తున్నారు. అయితే బీఆర్ఎస్‌లో మాత్రం ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత లేరనే లోటు ఉంది. ఇదే సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని పార్టీలో చేరడం బీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు.

కాసాని జ్ఞానేశ్వర్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తూనే గులాబీ బాస్.. ఈటల రాజేందర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కంటే పెద్ద మనిషి తమ పార్టీలోకి వచ్చారని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ముదిరాజ్‌లను ఈటల రాజేందర్ ఎదగనివ్వకుండా తొక్కేసారిని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అటువంటి తప్పు జరగకుండా చూసుకుంటామన్నారు. ముదిరాజ్‌లకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇచ్చి.. పదవులను కట్టబెడుతామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక.. ముదిరాజ్‌లతో ప్రత్యేకంగా సమావేశమవుతామని చెప్పారు.

ఇకపోతే కాసాని జ్ఞానేశ్వర్‌ను ఈసారే ఎన్నికల బరిలోకి దించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం టికెట్‌ను కాసాని జ్ఞానేశ్వర్‌కు ఇవ్వనున్నారట. బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు పోటీగా కాసానిని రంగంలోకి దింపనున్నారట. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే రెండుసార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజాసింగ్‌‌ను కాదని కాసాని గెలుపొందగలరా? అనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =