రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష.. రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ ఖరారు

CM KCR Held Review on The Decade Celebrations of Telangana Formation Day Finalized 21-Day Program Schedule,CM KCR Held Review on The Decade Celebrations,The Decade Celebrations of Telangana Formation Day,Telangana Formation Day Finalized,Telangana 21-Day Program Schedule,Mango News,Mango News Telugu,CM KCR Held Review,Telangana Formation Day,KCR reviews preparations of Telangana,Telangana Formation Day Latest News,Telangana Formation Day Latest Updates,Telangana Formation Day Live News,Decade Celebrations of Telangana News Today,CM KCR Latest News,CM KCR Latest Updates,CM KCR Live News,Telangana Formation Day Schedule

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో దశాబ్ది కార్యక్రమం ఒక మైలురాయి అని, గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చాటిచెప్పేందుకు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించే రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అలాగే రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు కూడా పాల్గొననున్నారు.

రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ వివరాలు ఇలా..

  • జూన్‌ 2 – ఉత్సవాలు ప్రారంభం
  • జూన్‌ 3 – రైతు దినోత్సవం
  • జూన్‌ 4 – సురక్షా దినోత్సవం
  • జూన్‌ 5 – తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం
  • జూన్‌ 6 – పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
  • జూన్‌ 7 – సాగునీటి దినోత్సవం
  • జూన్‌ 8 – ఊరూరా చెరువుల పండుగ
  • జూన్‌ 9 – సంక్షేమ సంబురాలు
  • జూన్‌ 10 – సుపరిపాలన దినోత్సవం
  • జూన్‌ 11 – సాహిత్య దినోత్సవం
  • జూన్‌ 12 – తెలంగాణ రన్‌
  • జూన్‌ 13 – మహిళా సంక్షేమ దినోత్సవం
  • జూన్‌ 14 – వైద్యారోగ్య దినోత్సవం
  • జూన్‌ 15 – పల్లె ప్రగతి దినోత్సవం
  • జూన్‌ 16 – పట్టణ ప్రగతి దినోత్సవం
  • జూన్‌ 17 – తెలంగాణ గిరిజనోత్సవం
  • జూన్‌ 18 – మంచి నీళ్ల పండుగ
  • జూన్‌ 19 – తెలంగాణ హరితోత్సవం
  • జూన్‌ 20 – తెలంగాణ విద్యాదినోత్సవం
  • జూన్‌ 21 – ఆధ్యాత్మిక దినోత్సవం
  • జూన్‌ 22 – అమరు వీరుల సంస్మరణ

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =