జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurates Jamp Pharma at Genome Valley Today Minister KTR Inaugurates Jamp Pharma, KTR Inaugurates Jamp Pharma at Genome Valley, Genome Valley, Jamp Pharma, Jamp Pharma Inauguration, Inauguration Of Jamp Pharma at Genome Valley Today Jamp Pharma Latest News, Jamp Pharma Latest Updates, Jamp Pharma Live Updates, Telangana Minister KTR, KTR, Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, Mango News, Mango News Telugu,

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ప్రముఖ జాంప్ ఫార్మా కంపెనీని ప్రారంభించారు. 250 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ లో అతిపెద్ద సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక్కడి జీనోమ్ వ్యాలీ క్లస్టర్‌లో రానున్న ఈ సంస్థ రాబోయే 24 నెలల్లో 2,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జాంప్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ లో తన యూనిట్ పెట్టడానికి ముందుకు రావడం చాలా ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కంపెనీకి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ జీనోమ్ వ్యాలీలో దాదాపు 800 కోట్ల విలువైన పలు కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించారు.

కెనడాకు చెందిన జాంప్ ఫార్మా గ్రూప్.. జాంప్ ఫార్మా జెనరిక్ ఉత్పత్తులు, మా ఓరిమిడ్ ఫార్మా బ్రాండెడ్ ఉత్పత్తులు, సహజ ఆరోగ్య ఉత్పత్తులు మరియు కాస్మెటిక్ ఉత్పత్తులతో ఔషధ రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జాంప్ ఫార్మా గ్రూప్ తన బయోజాంప్ విభాగాన్ని ప్రారంభించడంతో పరిశ్రమలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటైన బయోసిమిలర్స్‌లో  పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టింది. ఇటీవలే రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. సుమారు 7,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. మరోవైపు యువత కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్‌ ‘వై-హబ్‌’ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ తరహాలో వై-హబ్ ఏర్పాటు చేస్తామంటూ మంత్రి కేటీఆర్​ ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 16 =