పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్

CM KCR Inspects Works Of The Palamuru, CM KCR Inspects Works Of The Palamuru-Rangareddy Project, CM KCR Latest Political News, KCR Inspects Works Of The Palamuru, KCR Inspects Works Of The Palamuru Rangareddy Project, Mango News Telugu, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పనులను పరిశీలిస్తున్నారు. ఉదయం 9 గంటలకు హెలికాఫ్టర్ లో కరివెన రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకొని అక్కడ జరుగుతున్న పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. త్వరితగతిన నిర్మాణ పనులు సాగేందుకు కేసీఆర్ అధికారులు, ఇంజినీర్లకు పలు సూచనలు చేసారు.

ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవడంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ రోజు పూర్తిగా ప్రాజెక్టు సంబంధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. కరివెన రిజర్వాయర్ తరువాత వట్టెం, నార్లాపూర్, ఏదులలో జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు, ఖర్చు వివరాలు, పెండింగ్ నిధులకు సంబంధించిన వివరాల నివేదికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఖరీఫ్ నాటికీ జిల్లాలో 10 లక్షల ఎకరాకు నీరు అందించేలా ప్రత్యేక కార్యాచరణతో పనులు చేసేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి , ఇతర ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=w5LHpR5AyO0]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 4 =