రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలి

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Capital Amaravati Issue, Ganta Srinivasa Rao Comments Over Amaravati, Ganta Srinivasa Rao Comments Over Amaravati Issue, Ganta Srinivasa Rao Comments Over Capital Amaravati, Ganta Srinivasa Rao Comments Over Capital Amaravati Issue, Ganta Srinivasa Rao Latest Political News, Mango News Telugu, Srinivasa Rao Comments Over Capital Amaravati Issue

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మంత్రులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యల వలన రాష్ట్ర ప్రజల్లో అయోమయం నెలకుందని చెప్పారు. రాజధాని మార్పు అంశంపై వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఇప్పటికైనా మౌనం వీడి స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్టానికి దశదిశ నిర్ణయించే రాజధానిపై, ఆరేళ్ళు అయిన కూడ చర్చ జరగడం బాధాకరమని అన్నారు. రాజధాని పై నాన్చుడు ధోరణి వీడి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.

అమరావతి ప్రాంతంలో ఏదైనా అవినీతి జరిగితే ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని తెలిపారు. గతంలో రాజధానిపై అసెంబ్లీలో జగన్ అంగీకారం తెలిపారని, 30 వేల ఎకరాల్లో పెద్ద స్థాయిలో రాజధాని ఉండాలని ఆయన సూచించినట్టు తెలిపారు. రాజధానిని వికేంద్రీకరణ చేస్తారా, కొనసాగిస్తారా అనే విషయం తెలియజేయాలన్నారు. విశాఖపట్టణానికి కూడ అన్ని అర్హతలు ఉన్నాయని, ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని కోరారు. రాజధాని నిర్మాణం కోసం 30 వేల ఎకరాలకు పైగా భూములిచ్చిన రైతుల్లో ఆందోళన నెలకుందని, వారితో పాటు ఐదు కోట్లమంది ప్రజల మనోభావాలు, అభివృద్ధికి సంబంధించిన రాజధాని అంశంపై ఇలా చర్చలు జరగడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=vvoOjA1Kx70]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + twelve =