జనగామ పర్యటనలో సీఎం కేసీఆర్‌.. నూత‌న కలెక్టరేట్‌ ప్రారంభం

CM KCR, CM KCR Integrated District Offices Complex, CM KCR Integrated District Offices Complex Inauguration, CM KCR Participating In Inauguration Of Integrated District Offices Complex At Jangaon District, CM KCR Participating In Inauguration Of Integrated District Offices Complex At Jangaon District Today, Integrated District Offices Complex Inauguration, Integrated District Offices Complex Inauguration By KCR, Integrated District Offices Complex Inauguration In Jangoan, Integrated District Offices Complex Inauguration News, Jangaon District, KCR Participating In Inauguration Of Integrated District Offices Complex, Mango News

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్‌ విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా.. జిల్లా ప్రధాన కేంద్రం జనగామ పట్టణంలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం మధ్యాహ్నం ప్రారంభించారు. దీనికి ముందుగా జిల్లా పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని సీఎం కేసీఆర్ స్వీక‌రించారు. ఈ సందర్భంగా అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో కేసీఆర్ కు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్ శిలాఫ‌ల‌కాన్ని కేసీఆర్ ఆవిష్క‌రించారు. జిల్లా ప్రజలకు సత్వరంగా, సులభతరమైన సేవలందిచేందుకు గాను ఈ కలెక్టరేట్‌ భవనాన్ని అన్ని సదుపాయాలతో నిర్మించారు అధికారులు.

జనగామ పట్టణంలో దాదాపు రూ. 32 కోట్ల భారీ వ్యయంతో 25 ఎకరాల స్థలంలో దీనిని నిర్మించారు. మూడంతస్తుల బిల్డింగ్ లో నిర్మితమైన ఈ సముదాయంలో 34 శాఖలు వరకు కొలువుతీరేలా సమీకృత భవనాన్ని నిర్మించారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జనగామ జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వ కార్యక్ర‌మంలో.. మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ప్ర‌శాంత్ రెడ్డి, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డితో పాటు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయ‌కులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =