కాంగ్రెస్ మేనిఫెస్టో: 30,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా

Congress Party Manifesto, Congress Party Manifesto for GHMC Elections, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Mango News, Telangana Congress Manifesto for GHMC Elections, Telangana Congress Party, Telangana Congress Party Releases Manifesto, Telangana Congress Party Releases Manifesto for GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం నాడు మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్ లో ఇటీవల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.50000 అందిస్తామని ప్రకటించారు. అలాగే పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ.5 లక్షలు మరియు పాక్షికంగా నష్టం జరిగిన ఇళ్లకు రూ. 2.5 లక్షలు సహాయం అందిస్తామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో వివరాలు:

 • ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.50000 సాయం.
 • పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ.5 లక్షలు మరియు పాక్షికంగా ధ్వంసమైన వాటికీ రూ. 2.5 లక్షలు సహాయం.
 • వరదల్లో చనిపోయిన ప్రతి వ్యక్తికీ రూ.25 లక్షల పరిహారం.
 • విపత్తు ప్రణాలికను ఎన్డిఎమ్ఎ గైడ్ లైన్స్ తో రూపొందించి, పకృతి విపత్తు సంభవించినప్పుడు త్వరితగతిన సహాయం అందించే ఏర్పాట్లు.
 • 30,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా.
 • మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు, విద్యార్థులకు మెట్రో, ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం.
 • మెట్రో, ఎంఎంటీఎస్‌ సర్వీసులు పాతబస్తీ మరియు శంషాబాద్‌ వరకు విస్తరణ.
 • నగరంలో అర్హత కలిగిన అందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.
 • సొంతగా స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షల ఆర్థిక సాయం.
 • ఉచిత ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ అమలు.
 • 100 యూనిట్ల లోపు వాడుకునే గృహాలకు కరెంట్ ఉచితం.
 • నగరంలో అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్య పెంపు.
 • సింగిల్‌ స్క్రీన్‌ సినిమా థియేటర్లకు పన్ను మినహాయింపు.
 • మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టికెట్ల ధరల నియంత్రణ.
 • కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తాం.
 • బస్తీలలోని పేదల ఇళ్ళకు, పేదల డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు, దేశం కోసం అహర్నిశల కష్టపడ్డ సైనికులకు ఇంటి పన్ను రద్దు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 1 =