నూతన సచివాలయంలో 6 కీలక ఫైళ్లపై సంతకం చేసిన సీఎం కేసీఆర్, నేటి మ‌ధ్యాహ్నం తొలి స‌మీక్ష

CM KCR To be Held First Review Meet on Palamuru Lift Irrigation Today in New Secretariat,CM KCR To be Held First Review Meet,First Review Meet on Palamuru Lift Irrigation,Palamuru Lift Irrigation Today in New Secretariat,Mango News,Mango News Telugu,KCR signed 6 files,CM KCR First Review Meeting,CM KCR Review Meeting On Palamuru Rangareddy Lift,New Sectt is testimony of TS's reconstruction,CM KCR Latest News and Updates,Palamuru Lift Irrigation Latest News,CM KCR New Secretariat Latest Updates

తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్రశేఖర్ రావు సోమవారం మ‌ధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ స‌చివాల‌యంలో తొలి స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌నులు, క‌రివేన‌, ఉదండాపూర్ కాల్వ‌ల విస్త‌ర‌ణ ప‌నులతో పాటు ఉదండాపూర్ నుంచి తాగునీరు త‌ర‌లింపు ప‌నులు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ స‌మీక్ష చేపట్టనున్నారు. అలాగే కొడంగ‌ల్, వికారాబాద్ వెళ్లే కాల్వ పనులు మరియు రాష్ట్రంలో ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులపై కూడా సీఎం కేసీఆర్ స‌మీక్ష చేయ‌నున్నారు. ఇక ఈ స‌మావేశానికి ఆయా శాఖల మంత్రులు, సంబంధిత ఉన్నతాధికారులు హాజ‌రు కానున్నారు. ఇక అకాల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. సంప్రదాయ వాణిజ్య పంటలతో పాటుగా ఇతర పండ్ల తోటలు కూడా నీట మునిగాయి. దీంతో వర్షాలు, పంట నష్టం తదితర అంశాలపై కూడా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించనున్నారు.

కాగా సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం నూతనంగా నిర్మించిన డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ స‌చివాల‌యాన్ని అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరో అంతస్థులోని సీఎం చాంబర్‌లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా ఆయన 6 కీలక ఫైళ్లపై సంతకం చేశారు. ఇందులో దళితబంధు పథకం ఫైలుపై తొలి సంతకం చేయగా.. పోడుభూముల పట్టాల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ కింద లబ్ధిదారులకు ఆర్ధిక సాయం, గర్భిణులకు పౌష్టికాహారం కోసం అందించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌, రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, పాలమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సంబంధించిన ఫైళ్లపై వరుసగా సంతకాలు చేశారు. కాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సంతకం చేసిన సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక మరోవైపు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల మంత్రి కేటీఆర్‌ మరియు రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌ రావు సహా పలువురు మంత్రులు, ఆయా శాఖల అధిపతులు తమకు కేటాయించిన చాంబర్లలో బాధ్యతలు చేపట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 14 =