వేములవాడలో మహా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం

Minister KTR held High-level Review Meeting on Arrangements for Maha Shivaratri Celebrations in Vemulawada,Minister KTR,High-level Review Meeting,Arrangements for Maha Shivaratri,Maha Shivaratri Celebrations,Vemulawada Maha Shivaratri Celebrations,Mango News,Mango News Telugu,Vemulawada Maha Shivaratri Celebrations In Telugu,Vemulawada Maha Shivaratri Celebrations 202,Vemulawada Maha Shivaratri Celebrations Live,Vemulawada Maha Shivaratri Celebrations And Events,Vemulawada Temple Sevas Online Booking,Vemulawada Rajanna Temple,Vemulawada Temple Official Website,Vemulawada Temple Online Booking,Vemulawada Temple Timings,Vemulawada Temple Timings Today,Vemulawada Temple Timings Tomorrow

వేములవాడలో మహా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్‌ లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ ఆల‌య అభివృద్ధి, అలాగే వేములవాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల స్థితిగతులపై కూడా మంత్రి కేటీఆర్ సమీక్షించారు. వేములవాడలో జాతరకు అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో భద్రత, పారిశుధ్యం మరియు అవసరమైన సౌకర్యాలపై దృష్టి పెట్టాలన్నారు. వార్షిక సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేలా రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

భవిష్యత్‌లో వేములవాడ, సిరిసిల్ల పర్యాటక ప్రాంతాలుగా ఆవిర్భవిస్తాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వేములవాడ టెంపుల్ లేక్ బండ్ అభివృద్ధి, సిరిసిల్ల శివారులోని రామప్ప గుట్టలో ఎత్తైన శివుని విగ్రహం ఏర్పాటు, రామప్ప గుట్ట వద్ద కాటేజీలు, అడ్వెంచర్ గేమ్స్, నాంపల్లి గుట్ట వద్ద కేబుల్ కార్, వేములవాడ ఆలయానికి వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో ఫుట్‌పాత్‌లు నిర్మాణం, వాల్ పెయింటింగ్స్, మూల వాగు కట్టపై సైక్లింగ్ మరియు వాకింగ్ ట్రాక్, వేములవాడ దేవాలయంలో నృత్య మరియు సంగీత పాఠశాల, వేములవాడలో మినీ స్టేడియం, కొదురుపాక-వేములవాడ 4 లేన్ల రహదారి నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపడతామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 13 =