మే 4న ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

CM KCR To Inaugurate The New Permanent Office of BRS Built in Delhi on May 4,CM KCR To Inaugurate The New Permanent Office,Permanent Office of BRS Built in Delhi on May 4,New Permanent Office of BRS,Mango News,Mango News Telugu,BRS Permanent Office in Delhi,Telangana CM KCR to inaugurate new Secretariat,Telangana CM Rao to inaugurate new Vastu,CM KCR Latest News and Updates,CM KCR New Permanent Office Latest Updates,New Permanent Office of BRS News Today,New Permanent Office of BRS Latest Updates

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా పేరు మార్చుకున్న తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నిమిత్తం పార్టీ కార్యకలాపాలకు జాతీయ స్థాయి కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భవనం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నూతన కార్యాలయాన్ని మే 4న ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ గురువారం బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్‌లో వెల్లడించారు. ఇక నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి పార్టీ ఎంపీలందరూ హాజరవుతారని, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. ఇకపై జాతీయ స్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ ఈ కార్యాలయం నుంచే నడుస్తాయని, వివిధ పార్టీలతో జరిగే కీలక సమావేశాలకు పార్టీ కార్యాలయం వేదికగా నిలుస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − three =