మంథనిలో మాతా-శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Inaugurates Mother and Child Health Care Center in Manthani Today, Telangana Minister Harish Rao Inaugurates Mother and Child Health Care Center in Manthani Today, Harish Rao Inaugurates Mother and Child Health Care Center in Manthani Today, Mother and Child Health Care Center in Manthani, Harish Rao Inaugurated Mother and Child Health Care Center in Manthani Today, Manthani Mother and Child Health Care Center, Mother and Child Health Care Center, Telangana Finance Minister Harish Rao, Telangana Minister Harish Rao, Finance Minister Harish Rao, Minister Harish Rao, Telangana Finance Minister, Harish Rao, Manthani Mother and Child Health Care Center News, Manthani Mother and Child Health Care Center Latest News, Manthani Mother and Child Health Care Center Latest Updates, Manthani Mother and Child Health Care Center Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం మంథనిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మంథనిలో ఈరోజు మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త‌గా 30 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామ‌ని, అలాగే ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాలో మరో నాలుగు మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ స్థాయి వైద్యం అందట్లేదని, దీనిపై చర్చకు సిద్ధమని మంత్రి ప్రకటించారు. కేంద్రంలో 16 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉండగా, ఇలా కాంట్రాక్టు పద్దతిలో ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని, దీనికి వ్యతిరేకంగా పోరాడే వారిపై బీజేపీ ప్రభుత్వం అక్ర‌మ కేసులు బనాయిస్తోందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన సీఎం కేసీఆర్ చేయించారని బీజేపీ నేతలు అంటున్నారని, మరి ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్ తగులబెట్టారు కదా, అక్కడ ఏ ప్రభుత్వం ఉంది అని హరీష్ రావు ప్రశ్నించారు. బీజేపీది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని ఎద్దేవా చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =