మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్.. ఆలయానికి సీఐఎస్‌ఎఫ్‌ భద్రతను వ్యతిరేకిస్తూ స్థానికుల సంచలన నిర్ణయం

Shirdi Town To Go into Indefinite Shut Down From May 1st Against Deployment of CISF security in Saibaba Temple,Shirdi Town To Go into Indefinite Shut Down,Shirdi Town Shut Down From May 1st,Shirdi Against Deployment of CISF security,Deployment of CISF security in Saibaba Temple,Mango News,Mango News Telugu,Indefinite shutdown called in Shirdi from May 1,Shirdi to shut down indefinitely over deployment,Shirdi town to strike against CISF deployment,Shirdi residents seeking cover from CISF,Shirdi shutdown called over deployment of CISF,Shirdi Shut Down Latest News,Shirdi Shut Down Latest Updates

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన షిర్డీలో మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్‌ అమలుకానుంది. ఈ మేరకు ఆ ప్రాంత ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. షిర్డీలోని సాయిబాబా ఆలయ భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ‘సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌’ (సీఐఎస్‌ఎఫ్‌)ను నియమించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు సహా గ్రామస్తులు బంద్ పాటించనున్నారు. కాగా ప్రస్తుతం బాబా ఆలయానికి మహారాష్ట్ర పోలీసులే భద్రత కల్పిస్తున్నారు. అయితే ఆలయంపై దాడులు జరిగే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో.. సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో భద్రతను పటిష్ఠం చేయాలని సాయి సంస్థాన్ ట్రస్ట్ పెద్దలు మరియు ప్రభుత్వం నిర్ణయించారు. కానీ విమానాశ్రయాలు, పారిశ్రామిక సంస్థలు, మెట్రోస్టేషన్ల వద్ద గస్తీ కాయడం మినహాయించి షిర్డీ లాంటి ప్రధాన ఆలయం వద్ద ఎదురయ్యే భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి ఎలాంటి నైపుణ్యం లేదని షిర్డీవాసులు, వ్యాపారులు అభిప్రాయపడున్నారు. దీంతో ఆలయ భద్రతకు సీఐఎస్‌ఎఫ్‌ను నియమించడంపై అభ్యంతరం తెలుపుతున్నారు.

అంతేకాకుండా భద్రత దృష్ట్యా సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఆలయ పరిసరాల్లో విపరీతమైన ఆంక్షలు విధిస్తారని.. వాటివల్ల పర్యాటకులతో పాటు తమకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని వ్యాపారాలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం స్థానికులు, వ్యాపారులు, అన్ని సంఘాలవారు సమావేశమై నిరవధిక బంద్‌ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. షిర్డీ పట్టణంలో బంద్‌ పాటించినా ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని సాయి సంస్థాన్ ప్రకటించింది. అలాగే భక్తులకు దర్శనం సహా ఇతర సేవలు యథాతథంగా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. దీనిలో భాగంగా సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌ నిర్వహించే ఉచిత అన్నదానం, ట్రస్ట్‌కు సంబంధించిన వసతి సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంటాయని ట్రస్టు వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 5 =