సికింద్రాబాద్‌ గాంధీ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

CM KCR Unveils 16 Feet Mahatma Gandhi Statue at Gandhi Hospital Hyderabad, CM KCR will Unveil Mahatma Gandhi Statue, CM KCR Mahatma Gandhi Statue in Front of Gandhi Hospital, CM KCR Inagurating Mahatma Gandhi Statue, Gandhi Hospital, Gandhi Statue Unveil on OCT2, Mango News, Mango News Telugu, Minister Talasani Srinivas, Talasani Srinivas Yadav, CM KCR Latest News And Updates, Telangana CM KCR, Gandhi Jayanthi, Bapuji 16 Feet Statue

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం నగరంలోని గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన 16 ఫీట్ల మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ ముందుగా ఉదయం ఎంజి రోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని, గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుండి సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకొని హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన 16 ఫీట్ల గాంధీ విగ్రహన్ని సీఎం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, జీహెఛ్ఎంసీ మేయర్‌ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌, ఎమ్మెల్సీ వాణీదేవి, పలువురు ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు. హెఛ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.1.25 కోట్ల వ్యయంతో ధ్యాన భంగిమలో కూర్చున్న మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని 16 అడుగుల ఎత్తుతో, 5 టన్నుల బరువుతో ఏర్పాటు చేశారు. గాంధీ విగ్రహ ఆవిష్కరణ అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు.

సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, గాంధీ హాస్పిటల్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని గొప్పగా ప్రతిష్టింపజేయడం గొప్ప విషయం అన్నారు. మానవాళికి గొప్ప మార్గాన్ని, సందేశం ఇచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ అని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడిన గాంధీ ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందిని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించి, సెల్యూట్ చేశారు. గాంధీ ఆదర్శాన్ని, ధైర్యాన్ని పుణికిపుచ్చుకొని, హాస్పిటల్‌కు గాంధీ పేరుంది కాబట్టి, ఆయన పేరు నిలబెట్టాలని కరోనా మహమ్మారి సమయంలో వైద్యులు, సిబ్బంది యుద్ధం చేశారని సీఎం ప్రశంసించారు. ఇక మహాత్మా గాంధీ చూపిన ఆచరణలోనే ఈ రోజు తెలంగాణ సాధించుకుని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 − 1 =