నేడే సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ స‌మావేశం

CM KCR will Chair TRS Party State Executive Committee meeting, KCR Review Meeting, KCR to chair TRS State Executive Committee meeting, KCR TRS Party Meeting, Mango News, telangana, Telangana Budget, Telangana CM, Telangana CM Chairs Meeting, Telangana CM KCR, Telangana News, TRS Party Meeting, TRS Party State Executive Committee meeting, TRS State Executive Committee, TRS State Executive Committee meeting, Union Budget

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నేటి (ఫిబ్రవరి 7, ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు హాజరుకానున్నారు.

ఈ సమావేశం సందర్భంగా పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =