సీఎం కేసీఆర్ పుట్టిన రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ “కోటి వృక్షార్చన” కార్యక్రమం

Koti Vruksharchana Programe to be Held on the Occation of CM KCR's Birthday on Feb 17

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న “కోటి వృక్షార్చన” ద్వారా హరితపండగ నిర్వహించాలని సంకల్పించారు. తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు, ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం జరగనుంది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జరిగే కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరికీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావిస్తోంది.

ఆ రోజు మొక్కలు నాటుతూ దిగిన ఫోటోలను ప్రత్యేక యాప్ లో అప్ లోడ్ చేయాలి. యాప్ కోసం వాట్సప్ నుంచి 9000365000 నెంబర్ కు జీఐసీ (GIC) అని మెసేజ్ చేయాలి. యాప్ లింక్ తో కూడిన మెసేజ్ తిరిగి వస్తుంది. దానిలో మొక్కలు నాటుతూ సెల్ఫీ ఫోటోలను ఎవరికి వారు అప్ లోడ్ చేయాలి. కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా సీఎం సందేశంతో కూడిన వనమాలి బిరుదు ఈ మెయిల్ లేదా మొబైల్ కు వారం రోజుల్లో ఎవరికివారికి చేరుతుంది. ఈ కార్యక్రమ బ్రోచర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం నాడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్,‌ మహమూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =