వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదు, ఇంధన శాఖపై సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM YS Jagan Held Review on Energy Dept Orders Officials to There Should be No Shortage of Power in Summer, CM YS Jagan Held Review, CM YS Jagan on Energy Dept Orders, CM YS Jagan on No Shortage of Power in Summer, Mango News, Mango News Telugu, Ys Jagan Daughters,Ap Cm Ys Jagan,Ap Cm Ys Jagan Biodata,Ap Cm Ys Jagan Email Id,Ap Cm Ys Jagan Live,Ap Cm Ys Jagan Mohan Reddy House Address,Ap Cm Ys Jagan Mohan Reddy Phone Number,Ap Cm Ys Jagan Salary,Cm Ys Jagan Camp Office Address,Cm Ys Jagan Contact Number,Cm Ys Jagan Mohan Reddy,Cm Ys Jagan Mohan Reddy Phone Number,Cm Ys Jagan Phone Number,Cm Ys Jagan Salary,Cm Ys Jagan Security,Cm Ys Jagan Twitter,Ys Jagan Mohan Reddy Age

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ఇంధన శాఖపై కీలక స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా వేసవిలో విద్యుత్‌ డిమాండ్, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు సహా పలు అంశాలపై అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదని సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టంచేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడద‌ని, బొగ్గు కొరత రాకుండా నిల్వల విషయం సహా ఇతర అన్ని అంశాలపై అధికారులు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇచ్చే వ్యవసాయ కనెక్షన్లపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు కనెక్షన్ కోసం ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలని సీఎం ఆదేశాల ఇవ్వగా, అమలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని సీఎం స్పష్టం చేశారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి 1.06 లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని, మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్టు అధికారులు తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి ఇప్పటికే 2.18 లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కే.ఎస్‌ జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ కె.విజయానంద్, పలువురు ఇంధన శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − three =