రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే చేపట్టడంపై వివిధ కంపెనీలతో సీఎస్ సమావేశం

CM to shortly hold meeting with companies on Digital land Survey, CS holds meeting with companies, CS holds meetings with digital surveying companies, CS Somesh Kumar, CS Somesh Kumar held Meeting with Various Companies, CS Somesh Kumar held Meeting with Various Companies over Digital Land Survey, Digital Land Survey, Mango News, Somesh Kumar held Meeting with Various Companies over Digital Land Survey, telangana, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar holds a Preliminary meeting

రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే చేపట్టడానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ.400 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు మంగళవారం నాడు వివిధ కంపెనీలతో సీఎస్ సోమేశ్ కుమార్ ప్రాథమిక స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. భూముల డిజిటల్ సర్వే జరిపేందుకు ఆసక్తి వ్యక్తపరిచిన 17 కంపెనీలు ఈ చర్చలో పాల్గొన్నాయి. ఇతర రాష్ట్రాలలో నిర్వహించిన భూముల డిజిటల్ సర్వే సందర్భంగా తాము ఎదురుకున్న సమస్యల గురించి సీఎస్ కి ఆయా కంపెనీలు వివరించాయి.

భూముల డిజిటల్ సర్వేపై ఈ కంపెనీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. అలాగే భూముల డిజిటల్ సర్వేకు ఉపయోగించే పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, సర్వేకు పట్టే సమయం, అయ్యే వ్యయము, అందుబాటులో ఉన్న సర్వే పరికరాలు, సాంకేతిక నిపుణులు, కావాల్సిన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, ఇంటర్నెట్ సామర్ధ్యం తదితర అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగం కమీషనర్ అండ్ ఐ.జి శేషాద్రి, టి.ఎస్‌.టి.ఎస్.ఎండి వెంకటేశ్వర్ రావు, సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్సు కమీషనర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here