ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం-2022కు ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్ ఎంపిక

Telangana Govt Selected Sriramoju Haragopal For Prajakavi Kaloji Award 2022, Sriramoju Haragopal For Prajakavi Kaloji Award, Sriramoju Haragopal Selected By Telangana Govt, Telangana Govt Selects Haragopal For Kaloji Award, Sriramoju Haragopal, Poet Sriramoju Haragopal, Prajakavi Kaloji Award 2022, Prajakavi Kaloji , Telangana Poet Sri Kaloji, Mango News, Mango News Telugu, Prajakavi Kaloji Award Latest News And Updates

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం, 2015 సంవత్సరం నుంచి కాళోజి పురస్కారాన్ని ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా ఓ సాహితీవేత్తకు ఆ అవార్డును అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపిక కమిటీ ప్రతిపాదనలను పరిశీలించి, సీఎం కేసీఆర్ సూచనల మేరకు 2022 సంవత్సరానికి గానూ ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ ను కాళోజీ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ప్రతిష్టాత్మక కాళోజీ అవార్డు-2022 కు శ్రీరామోజు హరగోపాల్ ఎంపికైనట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవార్డు కింద రూ.1,01,116 నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగే కార్యక్రమంలో శ్రీరామోజు హరగోపాల్ కు అందించనున్నారు.

కాళోజీ పురస్కారానికి ఎంపికైన హరగోపాల్‌ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. “ప్రజాకవి కాళోజి స్మృతిలో తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాష, తెలంగాణ సాహిత్యం కోసం విశేషంగా కృషి చేసిన వారికి ప్రతి ఏటా ఇస్తున్న ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం 2022 కు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్ ఎంపికవడం సంతోషకరం. వారికి శుభాకాంక్షలు” అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =