నాణ్యమైన ఆహారం ప్రపంచానికి అందించడం మనందరి బాధ్యత: మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Singireddy Niranjan Reddy Participated In A Conference On Pesticides In Agriculture,Minister Singireddy Niranjan Reddy,Niranjan Reddy Participated In A Conference,Singireddy Niranjan Reddy On Pesticides In Agriculture,Mango News,Mango News Telugu,Usage Of Pesticides In Crops Cultivation,Transforming Agriculture For Better Tomorrow,Crop Health Management,Agriculture Minister Of Telangana,Singireddy Niranjan Reddy Constituency,Singireddy Niranjan Reddy Latest News,Singireddy Niranjan Reddy Latest Updates,Telangana Latest News And Updates

హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్ లో ‘వ్యవసాయరంగంలో ఉత్పాదకతను పెంచడంలో రసాయనాల పాత్ర మరియు సుస్థిర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు’ అంశంపై క్రాప్ లైఫ్ (పురుగుమందుల కంపెనీల ఉమ్మడి సంఘం) నిర్వహించిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో క్రాప్ లైఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ కేసీ రవి, క్రాప్ లైఫ్ ఇండియా వైస్ చైర్మన్ శ్రీనివాస్ కారవడి, ఏపీఎంఎ ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, నాణ్యమైన ఆహారం ప్రపంచానికి అందించడం మనందరి బాధ్యతని అన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే వ్యవసాయరంగం ఎంతో గొప్పదని, ప్రపంచ ఆకలితీర్చే సత్తా భారత్ కు ఉందన్నారు. పురుగుమందుల వాడకంపై నియంత్రణ ఉండాలని, హానికరమైన కీటకాలను నియంత్రించేటప్పుడు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చూడాలన్నారు. ఈ విషయంలో పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు పరిశ్రమలు ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు.

“పురుగుమందుల వాడకంపై రైతులకు మరింత అవగాహన కల్పించి చైతన్యపర్చాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. కంపెనీలు కూడా రైతులకు నిరంతరం శిక్షణనివ్వాలి. వ్యవసాయంలో రసాయనాల వాడకంతో పంట ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ప్రతి ఒక్కరూ శాస్త్రజ్ఞుల పరిజ్ఞానాన్ని, సైన్సును అర్దం చేసుకోవాలి. పురుగుమందుల వాడకంలో రైతులు మోసపోకుండా చట్టపరమైన నియంత్రణకు పరిశ్రమలు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి. రసాయనాల వాడకం, వ్యవసాయ యాంత్రీకరణలో ఊబరైజేషన్ దిశగా ప్రాధాన్యం ఇచ్చి శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలి. ఈ విషయంలో నేను పలుమార్లు విజ్ఞప్తి చేశాను” అని మంత్రి తెలిపారు.

“వ్యవసాయరంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. సాగునీరు, విద్యుత్, నేల యొక్క ఆరోగ్యం, పంటల వైవిధ్యీకరణ, పంటల నాణ్యత, పంటల మార్కెటింగ్ పై దృష్టిపెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో వీటిపై దృష్టిసారించి లక్ష్యానికి చేరువయింది. వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో నిలిచాం. వ్యవసాయరంగ అభివృద్ధి చెందాలంటే విభిన్న పంటల సాగును ప్రోత్సాహించాలి. దానిలో భాగంగా తెలంగాణలో పంటల వైవిధ్యీకణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పరిశ్రమలు వ్యాపార దృక్పధంతో పాటు సామాజిక బాధ్యతను నెరవేర్చాలి. వనపర్తి జిల్లా కేంద్రంలో వే సైడ్ మార్కెట్ నిర్మించిన సింజెంట కృషి అభినందనీయం. వినూత్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో దేశంలోనే తొలిసారి మహిళా డిగ్రీ వ్యవసాయ గురుకుల కళాశాల ఏర్పాటు చేశాం” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here