హుజూరాబాద్ లో ఇప్పటివరకు 14400 లబ్ధిదారుల ఖాతాలలో దళిత బంధు డబ్బులు జమ

Dalit Bandhu Implementation, Dalit Bandhu Implementation in Huzurabad, Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme Implementation, Dalit Bandhu Scheme News, Dalit Bandhu Scheme Updates, Funds Credited in 14400 Beneficiary Families Accounts, implementation of Dalit Bandhu, implementation of Dalit Bandhu Scheme, Mango News, Preparatory Meeting over Dalit Bandhu Scheme

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 14,400 లబ్ధిదారుల ఖాతాలలో దళిత బంధు డబ్బులు జమ అయ్యాయని కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్లస్టర్ అధికారులు, ప్రత్యేక అధికారులతో దళిత బంధుపై కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను అభినందించారు.

కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు సర్వే విజయవంతంగా పూర్తి పూర్తిచేశామని, ఇప్పటివరకు 14,400 లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. బుధవారం నుంచి అధికారులు రీ సర్వే చేస్తారని, దళిత కుటుంబాలందరికీ దళిత బంధు పథకం అమలవుతుందని అన్నారు. రీ సర్వే లో రేషన్ కార్డ్ లేని వారి వివరాలు తీసుకోవాలని, మైగ్రేట్ అయిన వారి వివరాలు కూడా తీసుకోవాలని, వాటన్నిటినీ ఆప్ లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వేలో భాగంగా బ్యాంకర్లను కూడా వెంట తీసుకెళ్లి గుర్తించిన కొత్త వారికి కూడా బ్యాంక్ అకౌంట్ లో తెరిపించాలని అన్నారు. మొదటిసారి సర్వే చేసినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే రీ సర్వేలో వారిని గుర్తించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఖాతాలో డబ్బులు జమ కాగానే సెల్ ఫోన్ లకు సంక్షిప్త సమాచారం వస్తుందని, దీన్ని అధికారులు ధృవీకరించుకోవాలని అన్నారు. దళిత కుటుంబాల అందరికీ దళిత బంధు పథకం అమలు చేయడంతో పాటు వారి ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eighteen =