వాటికి ఒక్కొక్కటే..నా!

Each one ticket to cpm cpi,Each one ticket to cpm,Each one ticket to cpi,Mango News,Mango News Telugu,cpm, cpi, congress, mla ticket, telangana assembly elections, telangana politics,Ticket Anger In Cong Spirals,Telangana assembly polls 2023,Left parties enter fray in three states,Telangana Politics,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Telangana Latest News and Updates
cpm, cpi, congress, mla ticket, telangana assembly elections, telangana politics

తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాల పరిస్థితి వామపక్షాలకే అర్థం కానట్లుగా మారింది. పొత్తుల కోసమెళ్తే.. ఏ పార్టీ కూడా వాటిని సరైన ప్రాధాన్యం ఇవ్వనట్లుగా కనిపిస్తోంది. మొదట్లో బీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఆసక్తి చూపారు. ఆశించిన సీట్లు దక్కకపోతే కేసీఆర్‌ మోసం చేసారంటూ కాంగ్రెస్‌తో దోస్తీకి సై అన్నారు. కానీ.. సీట్ల పంపకం కొలిక్కిరావడం లేదు. దాదాపు 20 రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ రెండు దఫాలుగా 100 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది. దీంతో పొత్తుల కథ ఏమైందనే ఉత్కంఠ పెరిగింది.

సీపీఐ, సీపీఐ(ఎం)కు చెరొక సీటు కేటాయిస్తే సరిపోతుందని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. అధికారంలోకి వస్తే చెరొక ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తామని కాంగ్రెస్‌ తెలంగాణ నేతలు హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి ప్రతిపాదనలకు అధిష్ఠానం ఓకే చేసినట్లు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 19 నియోజకవర్గాలకి సంబంధించిన కాంగ్రెస్‌ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. రాష్ట్ర నేతలతో ఈమేరకు ఆయన చర్చింనట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

కాంగ్రెస్‌ నిర్ణయించిన మేరకు సీపీఎంకు మిర్యాలగూడ, కొత్తగూడెం సీపీఐకి కేటాయించే అవకాశాలున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. సోమవారం కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ రాజస్థాన్‌లో మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపింది. మంగళవారం రాజస్థాన్‌తోపాటు తెలంగాణకు సంబంధించి మిగిలిన అభ్యర్థుల పేర్లు ప్రకటించవచ్చని సమాచారం. అయితే.. దీనికి సీపీఎం, సీపీఐలు ఒకేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీకి నిరంకుశ పాలనను అంతమొందించేందుకు తాము పొత్తుకు సిద్దమవుతామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. మోదీ హయాంలో యువత జీవనోపాధి కోసం పోరాడవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు.

అయితే.. మొదటి నుంచీ మిర్యాలగూడ సీటు కోసం పట్టుబడుతున్న సీపీఎంకు ఆ సీటు ఖాయమైనట్లే. అయితే ఇంకొక సీటు కూడా కోరుతున్నప్పటికీ కాంగ్రెస్‌ ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. అనుకున్న సీటు దక్కింది కాబట్టి ఒకే అంటుందా.. లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eight =