తెలంగాణలో పీఈటీ పోస్టుల ఫలితాలు విడుదల

Mango News Telugu, physical education teachers, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TRT PET Result 2019, TSPSC PET List, TSPSC Releases TRT PET Selection List

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) డిసెంబర్ 5, గురువారం నాడు టిఆర్‌టి పీఈటీ (తెలుగు మాధ్యమం) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు ఎంపికైన 364 మంది అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in లో అందుబాటులో ఉంచింది. టీఎస్‌పీఎస్సీ అక్టోబర్ 21, 2017 న రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 370 తెలుగు మీడియం పీఈటీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతరం ఫిబ్రవరి 28న 2018న రాతపరీక్ష నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ పూర్తీ స్థాయిలో నియామక ప్రక్రియను ముగించి 364 మందితో కూడిన ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోవడంతో మిగతా 6 పోస్టులు భర్తీ చేయలేదని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 7 =