ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్, రూ.80.65 కోట్ల విలువైన ఆస్తులు జప్తు

Enforcement Directorate Attaches Assets Worth Rs 80.65 Cr Belonging to MP Nama Nageswara Rao, Enforcement Directorate Seized Rs 80.65 Cr Belongings, Enforcement Directorate MP Nama Nageswara Rao, Enforcement Directorate Money Seized, Mango News, Mango News Telugu, MP Nama Nageswara Rao ED Shock, Enforcement Directorate, Enforcement Directorate Latest News And Updates, ED Hyderabad, MP Nama Nageswara Rao Rs 80.65 Cr Belongings Seized, MP Nama Nageswara Rao, MP Nama Nageswara Rao News And Live Updates

టీఆర్‌ఎస్ పార్టీ‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. నామా నాగేశ్వరరావు మరియు అతని కుటుంబ సభ్యులకు చెందిన 80.65 కోట్ల విలువైన 28 స్థిరాస్తులు మరియు ఇతర ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు/అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్, మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మరియు దాని డైరెక్టర్ మరియు ప్రమోటర్లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పీఎంఎల్ఏ చట్టం-2002 నిబంధనల ప్రకారం ఈ ఆస్తులను అటాచ్ చేస్తునట్టు ఈడీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయం మరియు నివాస ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. అలాగే హైదరాబాద్, ఖమ్మం మరియు ప్రకాశం జిల్లాలో రూ.67.08 కోట్ల స్థిరాస్తులు మరియు రూ.13.57 కోట్ల చరాస్తులను గుర్తించి మొత్తంగా 80.65 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అంతకుముందు జూలై 2022లో కూడా మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు మరియు దాని డైరెక్టర్లు అండ్ ప్రమోటర్లుకు చెందిన రూ.80.65 కోట్ల విలువైన 105 స్థిరాస్తులు మరియు ఇతర ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. ఎంపీ నామా నాగేశ్వరరావు మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ప్రమోటర్ మరియు డైరెక్టర్ గా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =