విశాఖ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Leaves Vizag and Reaches to Mangalagiri Party Office, Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan Leaves Vizag, Pawan Kalyan Reaches to Mangalagiri Party Office, Mango News,Mango News Telugu, Janasena Mangalagiri Party Office, Pawan Kalyan Leaves Vizag, Pawan Kalyan At Gannavaram Airport, Pawan Kalyan Janavani Program, Vizag Janavani Program, Janasena Chief Pawan Kalyan Vizag Tour, Janasena Party, Janasenani AP, AP Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan Vizag Janavani Program, Janavani Program Latest News And Updates

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం విశాఖపట్నం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ముందుగా పార్టీ నాయకులతో సమావేశాలు, జనవాణి కార్యక్రమం కోసం మూడు రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అక్టోబర్ 15, శనివారం సాయంత్రం విశాఖకు వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర మంత్రులపై దాడి ఘటనలో జనసేన నాయకుల అరెస్టు, శనివారం జనసేన ర్యాలీ అనంతరం పోలీసుల ఆంక్షల నేపథ్యంలో రెండ్రోజుల నుంచి పవన్ కళ్యాణ్ విశాఖలోని నోవాటెల్ హోటల్ కే పరిమితమయ్యారు. నగరంలో సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదంటూ ఆదివారం ఉదయం పవన్ కళ్యాణ్ కి విశాఖపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక విశాఖలో నెలకొన్న పరిస్థితులు, నాయకుల అరెస్టు, పార్టీ కార్యాచరణపై ఆదివారం రాత్రి పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. అలాగే సోమవారం ఉదయం మంత్రులపై దాడి ఘటనలో అరెస్టు అయ్యి విడుదల అయిన పలువురు నాయకులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఓ వీడియో విడుదల చేశారు. “విశాఖపట్నంలో 115 మందికి పైగా జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై జనసేన లీగల్ టీం న్యాయ పోరాటం చేసి 60, 70 మందికి స్టేషన్ బెయిల్ తెచ్చాము. 10, 12 మందిని రిమాండ్ కు పంపించారు, వారికీ కూడా బెయిల్ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. హైకోర్టులో కూడా పిటిషన్ వేయనున్నాం. ఇది ప్రభుత్వం మీద పోరాటం తప్ప, పోలీస్ వ్యవస్థ మీద పోరాటం కాదని తెలియజేస్తున్నాం. బయట ఎదురుచూస్తున్న ప్రజలకు కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇటువంటి ఆంక్షలే భవిష్యత్తులో విధించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేయడానికి న్యాయ నిపుణులతో చర్చించనున్నాం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అనంతరం పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని మంగళగిరికి బయలు దేరారు. మరోవైపు తన విశాఖ పర్యటనలో జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేసేందుకు పవన్ కళ్యాణ్ రేపు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలవనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ నాయకులు గవర్నర్ అప్పోయింట్మెంట్ కోసం సంప్రదించినట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 5 =