జనవరి 2, 3 తేదీల్లో కేరళలో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్‌ లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha To Participate in Indian Library Congress in Kannur from 2nd To 3rd January 2023,MLC Kavitha,Indian Library Congress,Kannur Indian Library Congress,Mango News,Mango News Telugu,Indian Library Congress Kannur,Indian Library Congress 2nd To 3rd January,Indian Library Congress January 2023,January 2023 Indian Library Congress,Indian Library Congress Latest News and Updates,Indian Library Congress News and Updates,Kannur Indian Library Congress News and Updates

బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 2023, జనవరి 2, 3 తేదీల్లో కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జనవరి 1-3 తేదీల్లో ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్‌ జరగనుంది. ఈ ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను జనవరి 1వ తేదీన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రారంభించనుండగా, ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకావాలంటూ ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం పలికారు.

ఈ నేపథ్యంలో 2, 3 తేదీల్లో కేరళలోని కన్నూరులో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో కవిత పాల్గొననున్నారు. జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావడంతో పాటుగా, 3వ తేదీన పలు అంశాలపై చర్చల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొననునట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ, “కన్నూర్‌లో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్‌కు హాజరయ్యేందుకు మరియు పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నాను. నేను 2023 జనవరి 2 నుండి 3వ తేదీ వరకు సెషన్‌లో చేరతాను. కొన్ని ఆసక్తికరమైన సంభాషణల కోసం ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 14 =